Akash Puri: చార్మీ కోసం భార్యకు పూరీ విడాకులు? ఆకాశ్‌ ఏమన్నాడంటే?

21 Jun, 2022 20:48 IST|Sakshi

స్టార్‌ దర్శకుడు పూరీ జగన్నాథ్‌, హీరోయిన్‌ చార్మీల మధ్య ఏదో ఉందంటూ చాలాకాలంగా ఏవేవో కథనాలు సోషల్‌ మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి. పూరీ కనెక్ట్స్‌ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించిన పూరీ, చార్మీతో కలిసి సినిమాలు నిర్మిస్తున్నాడు. ఈ క్రమంలో వీరిద్దరూ బయట పార్టీల్లో కనిపిస్తుండటంతో వీళ్ల మధ్య సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌ జరుగుతోందని గాసిప్‌రాయుళ్లు కథనాలు అల్లేశారు. అంతేకాదు, ఏకంగా పూరీ తన భార్యకు విడాకులు కూడా ఇవ్వడానికి సిద్ధమయ్యాడంటూ వార్తలు రాసుకొచ్చారు.

తాజాగా ఈ రూమర్లపై పూరీ తనయుడు, హీరో ఆకాశ్‌ పూరీ స్పందించాడు. 'నాన్న సినీకెరీర్‌లో చాలా నష్టపోయాడు. అమ్మకు పరిస్థితి అర్థమై మాకు ఆ విషయాలేవీ తెలియకూడదని చెల్లిని, నన్ను హాస్టల్‌ పంపించారు. అప్పుడు నేను మూడో తరగతి చదువుతున్నా. మేమేమో.. మా నాన్న పెద్ద డైరెక్టర్‌, అంతా హ్యాపీ అనుకున్నాం. కొన్నాళ్ల తర్వాత మాకు అసలు విషయం అర్థమైంది. మేము వేసుకునే బట్టల నుంచి, తినే ఫుడ్‌ వరకు, ఉంటున్న ప్లేస్‌ అంతా మారిపోయింది. ఉన్న ఇల్లు, కార్లు కూడా అమ్మేశాం. ఐదారేళ్లు నరకం చూశాం. కానీ మా నాన్న మళ్లీ బౌన్స్‌ బ్యాక్‌ అవ్వడం మాత్రం మామూలు విషయం కాదు. మా ఫ్యామిలీ ఇప్పుడిలా ఉందంటే కారణం అమ్మే. 

అమ్మానాన్న విడాకులు తీసుకుంటారన్న వార్త నేనింతవరకు వినలేదు. నాన్నకు పెద్ద సపోర్ట్‌ మమ్మీనే. వాళ్లది లవ్‌ మ్యారేజ్‌. కొందరు టైంపాస్‌ కోసం వీరు విడాకులు తీసుకుంటున్నారంటూ ఇష్టం వచ్చినట్లు రాస్తూనే ఉంటారు. కానీ అదైతే నిజం కాదు. ఇక్కడ మీకో నిజం చెప్తాను.. మా పేరెంట్స్‌ లవ్‌లో ఉన్న సమయంలో నాన్న అమ్మకు ఫోన్‌ చేసి పెళ్లి చేసుకుందాం, వస్తావా? అని అడిగాడు. హా, వచ్చేస్తానంది అమ్మ. నా జేబులో రూ.200 మాత్రమే ఉన్నాయి. రేపు ఎలా ఉంటుందో కూడా తెలీదు, నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అడిగాడట. క్షణం కూడా ఆలోచించకుండా చేసుకుంటానని వచ్చేసింది. ఇంతలా ప్రేమించేవాళ్లు నిజంగా ఉంటారా? అనిపించింది' అని చెప్పుకొచ్చాడు ఆకాశ్‌.

చదవండి: తింటున్న టైంలో వచ్చి ముక్కు కోసేశాడు, ప్లేటంతా రక్తమే..
 బికినీ ఫొటోలు నాన్న చూడకూడదని అలా చేస్తా.. బుల్లితెర నటి

మరిన్ని వార్తలు