దొంగల బజార్‌ ఖరార్‌

19 Feb, 2021 03:51 IST|Sakshi

పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాష్‌ పూరి చోర్‌ బజార్‌లోకి ఎంటరయ్యారు. దొంగిలించిన వస్తువులను చేర్చే చోటునే చోర్‌ బజార్‌ అంటారు. దొంగ ఎవరు? అనేది తర్వాత తెలుస్తుంది. ‘జార్జ్‌ రెడ్డి’ ఫేమ్‌ జీవ¯Œ  రెడ్డి దర్శకత్వంలో ఆకాష్‌ పూరి హీరోగా రూపొందుతున్న చిత్రానికి ‘చోర్‌ బజార్‌’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. వీ ప్రొడక్ష¯Œ ్సపై వీఎస్‌ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం గురువారం ప్రారంభమైంది. తొలి సీన్‌కి ఆకాష్‌ తల్లి లావణ్య కెమెరా స్విచ్చాన్‌ చేయగా, సోదరి పవిత్రా పూరి క్లాప్‌ ఇచ్చారు. బాలు మున్నంగి స్క్రిప్ట్‌ను అందించారు. ఐ.వి ఎస్‌.ఎన్‌ రాజు దర్శకత్వం వహించారు. ‘‘ఈ కథ అందరి ఊహలకు భిన్నంగా ఉంటుంది. మంచి లవ్, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. ఈ నెల 26న రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. సుబ్బరాజు, పోసాని, అర్చన నటించనున్న ఈ చిత్రానికి కెమెరా: జగదీష్‌ చీకటి, సంగీతం: సురేష్‌ బొబ్బిలి, ఎడిటింగ్‌: సత్య గిడుటూరి, సహ నిర్మాత: అల్లూరి సురేష్‌వర్మ.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు