Akash Puri: మాస్‌ హీరోగా గుర్తింపు దక్కింది: ఆకాష్ పూరి

27 Jun, 2022 07:18 IST|Sakshi

Akash Puri  Emotional Speech In Chor Bazaar Success Meet: ''చోర్‌ బజార్‌' సినిమాతో మాస్‌ హీరోగా మెప్పించాననే పేరు నాకు దక్కింది. జనాల్లోకి హీరోగా వెళ్లిపోయాను అనే ప్రశంసలు దక్కుతున్నాయి. ఆ క్రెడిట్‌ దర్శకుడు జీవన్‌ రెడ్డిదే. నా గత చిత్రాల (మెహబూబా, రొమాంటిక్‌) కన్నా 'చోర్‌ బజార్‌' గ్రాండ్‌గా ఉందంటున్నారు. దానికి కారణం నిర్మాత వీఎస్‌ రాజు'' అని ఆకాష్‌ పూరి తెలిపాడు. 

జీవన్‌ రెడ్డి దర్శకత్వంలో ఆకాష్ పూరి, గెహనా సిప్పీ జంటగా తెరకెక్కిన చిత్రం 'చోర్ బజార్‌'. యూవీ క్రియేషన్స్‌ సమర్పణలో వీఎస్‌ రాజు నిర్మించిన ఈ సినిమా శుక్రవారం (జూన్‌ 24) విడుదలైంది. ఈ సందర్భంగా జరిగిన సక్సెస్‌ సమావేశంలో ''ఫస్ట్‌ టైమ్‌ 'చోర్‌ బజార్‌' వంటి ఒక కమర్షియల్‌ సినిమా చేశాను. మా చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు'' అని డైరెక్టర్‌ జీవన్‌ రెడ్డి పేర్కొన్నారు. 'మా శ్రమకు మంచి ఫలితాన్ని ఇచ్చిన ఆడియెన్స్‌కు థ్యాంక్స్‌' అని నిర్మాత వీఎస్ రాజు తెలిపారు. 

చదవండి:👇
చై-సామ్‌ బాటలో మరో టాలీవుడ్‌ జంట?
'నువ్వే కావాలి' నటుడికి నిర్మాత బెదిరింపులు.. పోలీసులకు ఫిర్యాదు
హీరోను దుమ్మెత్తిపోసిన నెటిజన్లు.. సైలెంట్‌గా ఉండమని కామెంట్లు..
9 సార్లు పిల్లలను కోల్పోయిన స్టార్‌ హీరోయిన్‌..

మరిన్ని వార్తలు