రన్నింగ్‌ బస్‌లో లిప్‌లాక్‌.. ‘రొమాంటిక్‌’గా పూరీ కొడుకు

1 Mar, 2021 19:03 IST|Sakshi

పూరీ జగన్నాథ్‌ కొడుకు ఆకాష్‌ పూరీ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం రొమాంటింగ్‌. ఢిల్లీ బ్యూటీ కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. అనిల్‌ పడూరీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను పూరీ జగన్నాథ్‌, ఛార్మీ కౌర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కథ, మాటలు, స్క్రీన్ ప్లే పూరీ అందిస్తున్నాడు. రొమాంటిక్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. జూన్‌ 18న థియేటర్లలో సినిమా రిలీజ్‌ కానున్నట్లు సోమవారం హీరో ఆకాష్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అధికారికంగా ప్రకటించాడు. ఈ మేరకు రిలీజ్ డేట్ పోస్టర్‌లో.. న‌డుస్తున్న బ‌స్ డోర్ ద‌గ్గర‌ హీరోయిన్‌ను ఆకాష్ లిప్ లాక్ చేస్తుండ‌టం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. దీన్ని బట్టి సినిమా ఎంత రొమాంటిక్‌గా ఉండబోతోందో అర్థమవుతోంది. 

అయితే ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ గతేడాది మే నెలలోనే విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా వాయిదా నిలిచిపోయింది. రమ్య కృష్ణ, మందిరా బేడి, మకరంద్‌ దేశ్‌పాండే, దివ్యదర్శిని తదితరులు కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు సందర్భంగా రొమాంటిక్‌ సినిమా టీజర్‌ను పూరీ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. అలాగే పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ఆంధ్రాపోరి చిత్రంతో టాలీవుడ్‌లోకి ఆకాష్‌ ఎం‍ట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 2018లో మెహబూబా చిత్రంతో పలకరించాడు. ఇండియా- పాకిస్తాన్‌ ప్రేమ కథతో తెరకెక్కిన ఈ సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. దీంతో ఈ  సినిమాతో అయినా హిట్ కొట్టాల‌ని ఆకాష్‌ ఎదురు చూస్తున్నాడు. 

A post shared by Akash Puri (@actorakashpuri)

ఇదిలా ఉండగా అక్కినేని అఖిల్‌ నటించిన మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ చిత్రం కూడా జూన్‌ నెలలోనే విడుదల కానుంది. బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇకపోతే రొమాంటిక్‌ జూన్‌ 18న రిలీజ్‌ అవుతుండగా.. జూన్‌ 18న మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వస్తున్నాడు. దీంతో ఈ రెండు సినిమాలు బాక్సీఫీస్‌ వద్ద పోటీ పడనున్నాయని చెప్పవచ్చు.

చదవండి:

‘ఆకాష్‌’ దొంగల బజార్‌ ఖరార్‌

కామ్రేడ్‌గా చరణ్‌.. ఆచార్య సెట్‌లో నాన్నతో ఇలా..

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు