‘రొమాంటిక్‌’గా ట్రైలర్‌.. ఆకట్టుకుంటున్న ఆకాశ్‌ పూరీ

19 Oct, 2021 17:16 IST|Sakshi

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాష్ పూరి బాల నటుడిగా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు. అనంతరం హీరోగా సైతం ఎంట్రీ ఇచ్చాడు. ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం ‘రొమాంటిక్’. అనిల్ పాడూరి దర్శకుడు. కేతిక శ‌ర్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీకి స్టోరీ, డైలాగ్స్‌ పూరినే అందించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు ఆకట్టకోగా.. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ విడుదల చేశాడు.

‘ఐ లైక్ దిస్ ఎనిమ‌ల్’ అంటూ ఆకాశ్‌ చెప్పే డైలాగ్‌తో ప్రారంభమయిన ఈ ట్రైలర్‌ ఎంతో రొమాంటిక్‌గా సాగింది. ఎంతోకాలంగా మంచి హిట్‌ కోసం చూస్తున్న ఈ కుర్ర హీరో ఎలాగైనా సక్సెస్‌ రుచి చూడాలని కసిగా  ఈ సినిమాతో చేస్తున్నాడు. పూరీ జ‌గ‌న్నాథ్‌ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్‌లో పూరీ జగన్నాథ్, ఛార్మి కౌర్‌తో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ర​మ్యకృష్ణ కీలకపాత్రలో నటిస్తోంది. సునీల్ కశ్యప్ సంగీత అందిస్తున్న ఈ మూవీ అక్టోబర్‌ 29న థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది.

చదవండి: ప్రభాస్ ‘సలార్‌’లో మిస్ ఇండియా మీనాక్షి చౌదరి?

మరిన్ని వార్తలు