‘అఖండ’ ఫైట్‌ మాస్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు

6 Dec, 2021 12:44 IST|Sakshi
కెవిన్, శివ, స్టీవెన్‌

క్లైమాక్స్‌ఫైట్‌ కష్టంగా అనిపించింది

నేపథ్య సంగీతంతో ఫైట్స్‌కి ప్లస్‌

ఫైట్‌ మాస్టర్, యాక్టర్‌ శివ

‘‘తెలుగు ప్రేక్షకులు యాక్షన్‌ సన్నివేశాలను బాగా ఇష్టపడతారు. తమిళంలో కాస్త తక్కువ. కానీ రజనీకాంత్, విజయ్‌ వంటి హీరోలకు మాత్రం వారి అభిమానులు భారీ యాక్షన్‌ సీక్వెన్సెస్‌నే కోరుకుంటారు’’ అని స్టంట్‌ శివ అన్నారు. బాలకృష్ణ, ప్రగ్యాజైస్వాల్‌ జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అఖండ’. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 2న విడుదలైంది. 


ఈ చిత్రానికి పనిచేసిన ఫైట్‌ మాస్టర్, యాక్టర్‌ శివ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘మెకానిక్‌గా ఉన్న నేను సినిమాలపై ఆసక్తితో ఫైట్‌ మాస్టర్‌గా మారాను. బాలకృష్ణగారి ‘లక్ష్మీనరసింహా, విజయేంద్ర వర్మ, సింహా’ చిత్రాలకు ఫైట్స్‌ కంపోజ్‌ చేశాను. ఇప్పుడు ‘అఖండ’ కు వర్క్‌ చేయడం సంతోషంగా ఉంది. బాలకృష్ణగారి  ‘అఘోరా’ పాత్రకు ఫైట్స్‌ కంపోజ్‌ చేశాం. ఫైట్స్‌ మాస్టర్స్‌లా కాకుండా బాలకృష్ణగారి అభిమానుల్లా ఫైట్స్‌ కంపోజ్‌ చేశాం. ఈ సినిమాకి దాదాపు 65 రోజులు ఫైట్స్‌ తీయగా, మరో 15 రోజులు యాక్షన్‌ సీన్స్‌లోని మిగతా వర్క్, ఎలివేషన్‌ షాట్స్‌ తీశాం. క్లైమాక్స్‌ ఫైట్‌ కంపోజింగ్‌ కాస్త కష్టంగా అనిపించింది. యాక్షన్‌ సీక్వెన్సెస్‌ను బాలకృష్ణగారు సూపర్‌హీరోలా చేశారు. యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణలో బోయపాటిగారు ఓ ఫైట్‌మాస్టర్‌లానే ఆలోచిస్తారు. నిర్మాత రవీందర్‌రెడ్డిగారు బాగా హెల్ప్‌ చేశారు. తమన్‌ సంగీతం, నేపథ్య సంగీతం కూడా ఫైట్స్‌కి ప్లస్‌ అయ్యాయి. (అన్‌స్టాపబుల్‌ షోలో సూపర్‌ స్టార్‌ సందడి.. ఫొటోలు వైరల్‌)


‘క్రాక్‌’ తర్వాత యాక్టర్‌గా నాకు మంచి ఆఫర్లు వస్తున్నాయి. ‘ఎఫ్‌ 3’ చిత్రంలో నేనే మెయిన్‌ విలన్‌. ఫైట్‌ మాస్టర్‌గా ‘రామారావు: ఆన్‌ డ్యూటీ’, ‘ధమాకా’ తో పాటు మరికొన్ని సినిమాలు ఉన్నాయి. పీటర్‌ హెయిన్స్‌ సోదిరిని వివాహం చేసుకున్నాను. నా కుమారులు కెవిన్, స్టీవెన్‌ కూడా ఫైట్‌ మాస్టర్స్‌గా చేస్తున్నారు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో కెవిన్, స్టీవెన్‌ పాల్గొన్నారు. (‘అఖండ’ లోని గిత్తలు ఎవరివో, వాటి ప్రత్యేకత ఏంటో తెలుసా?)

మరిన్ని వార్తలు