Akhanda: బాలయ్య బర్త్‌డే సర్‌ప్రైజ్‌.. నవ్వుతూ నటసింహం అలా..

9 Jun, 2021 17:46 IST|Sakshi

‘సింహా’,‘లెజెండ్‌’ వంటి బిగ్గెస్ట్‌ హిట్స్‌ తర్వాత నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘అఖండ’.ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్‌పై మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలొ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా, పూర్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ముఖ్యంగా ఉగాది కానుకగా టైటిల్ రోర్ పేరుతో వదిలిన టీజర్.. రికార్డు స్థాయిలో వ్యూస్ రాబడుతూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

తాజాగా బాలయ్య పుట్టిన రోజు (జూన్‌ 10) సందర్భంగా బుధవారం సాయంత్రం ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్‌ని విడుదల చేశారు మేకర్స్‌. బర్త్ డే విషెస్ తెలుపుతూ రిలీజ్ చేసిన 'అఖండ' న్యూ పోస్టర్ లో బాలకృష్ణ నవ్వుతూ స్టైలిష్ గా నడుచుకుంటూ వస్తున్నాడు. కలర్ ఫుల్ గా ఉన్న బ్యాగ్రౌండ్ చూస్తుంటే ఇది సెలబ్రేషన్ మూడ్ లో వచ్చే సాంగ్ లోదని అర్థం అవుతోంది. కొత్త పోస్టర్‌ విడుదలతో ఒక్క రోజు ముందే నందమూరి అభిమానుల్లో పుట్టిన రోజు సంబరాలు మొదలయ్యాయి. ఈ పోస్టర్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ బాలయ్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 


చదవండి:
రెమ్యునరేషన్‌ పెంచేసిన స్టార్‌ హీరోలు.. ఒక్కో సినిమాకు ఎంతంటే..
PSPK28: ఫ్యాన్‌ మేడ్‌ పోస్టర్‌ వైరల్‌.. స్పందించిన నిర్మాణ సంస్థ

మరిన్ని వార్తలు