రొమాంటిక్‌ సన్నివేశాల్లో నటించాలంటే సిగ్గు: అఖిల్‌

15 Oct, 2021 12:58 IST|Sakshi

Akhil Akkineni Interview With Sakshi TV: ‘‘ప్రస్తుతం మీకున్న మూడు విష్‌లు ఏంటి?’’ అనే ప్రశ్నకు.. మూడో విష్‌గా ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ బ్లాక్‌ బస్టర్‌ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు అఖిల్‌. మరి మొదటి రెండు విష్‌లు? ‘సాక్షి’ టీవీతో ఆ విషయాలు, ఎన్నో విశేషాలు అఖిల్‌ పంచుకున్నారు.ఈ సందర్భంగా అఖిల్‌.. ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’లో హర్ష (అఖిల్‌ పాత్ర పేరు) సోల్‌ సెర్చింగ్‌లో ఉంటాడు.

తనని తను కనుక్కునే ప్రయత్నం. సినిమాలో హర్ష తనకు 50 పర్సెంట్‌ కెరీర్, 50 పర్సెంట్‌ మ్యారీడ్‌ లైఫ్‌ అంటాడు. నాకు పర్సనల్‌గా ప్రస్తుతానికి హండ్రెడ్‌ పర్సెంటూ కెరీరే. ఇక సినిమాలో రొమాంటిక్‌ సన్నివేశాలపై మాట్లాడుతూ.. రొమాంటిక్‌ సన్నివేశాల్లో తాను చాలా ఇబ్బంది పడతానని. షూటింగ్‌ సమయంలో చుట్టూ వంద మంది ఉంటారు అలాంటి వాతావరణంలో రొమాంటిక్‌ సీన్స్‌ చేయడానికి కొంచెం సిగ్గనిపిస్తుందంటూ చెప్పుకొచ్చాడు.

పెళ్లికి మీ నిర్వచనం ఏంటంటే..
ఇద్దరూ కంఫర్ట్‌గా ఉండాలి. నువ్వు నీలా ఉండగలగాలి, వాళ్లను వాళ్లలా ఉండనివ్వాలి. 

లవ్‌లో పడ్డారట కదా..
అఖిల్‌ (ఆశ్చర్యపోతూ..) ఈ చిత్రంలో ‘ఏ జిందగీ’ పాట పాడిన అమ్మాయి వాయిస్‌తో లవ్‌లో పడ్డానని అన్నానంతే. ఆ పాట వినగానే ‘ఐ ఫెల్‌ ఇన్‌ లవ్‌ విత్‌ హర్‌ వాయిస్‌’ అని భాస్కర్‌తో అన్నాను. రోజూ ఉదయం ఒక్కసారైనా ఆ పాట వింటున్నాను.

దేవుణ్ణి మూడు కోరికలు కోరుకునే అవకాశం వస్తే మీరు ఏం అడుగుతారు?
‘కరోనా పాండమిక్‌ వెళ్లిపోవాలి. రెండోది థియేటర్స్‌ అన్నీ తెరుచుకుని ప్రేక్షకులతో కళకళలాడాలి. మూడోది ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌...’ చిత్రం బ్లాక్‌ బస్టర్‌ అవ్వాలి’’ అన్నారు అఖిల్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు