సూపర్‌గా సెట్‌ చేశా!

20 Oct, 2020 00:15 IST|Sakshi

అఖిల్‌ అక్కినేని హీరోగా పూజా హెగ్డే హీరోయిన్‌గా ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’. అల్లు అరవింద్‌ సమర్పణలో జిఏ2 పిక్చర్స్‌ బ్యానర్‌లో బన్నీ వాసు, వాసూవర్మ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రీ–టీజర్‌ని విడుదల చేశారు. ఈ టీజర్‌లో అఖిల్‌ సినిమాలోని తన పాత్రని పరిచయం చేసుకుంటూ.. ‘అయామ్‌ హర్ష. ఒక అబ్బాయి లైఫ్‌లో 50 శాతం కెరీర్, 50 శాతం మ్యారీడ్‌ లైఫ్‌.. కెరీర్‌ని సూపర్‌గా సెట్‌ చేశా.. ఈ మ్యారీడ్‌ లైఫే. ఓ అయ్యయ్యయ్యో..’ అంటూ టీజర్‌కి లీడ్‌ ఇచ్చారు.

‘‘ఇప్పటికే 80 శాతం షూటింగ్‌  పూర్తయింది. అఖిల్, పూజా హెగ్డేల మధ్య వచ్చే సన్నివేశాలు చాలా థ్రిల్లింVŠ గా ఉంటాయి. భాస్కర్, బన్నీ వాసు కుటుంబ ప్రేక్షకులు, యువత లక్ష్యంగా సినిమాలు తీస్తారు. వీరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుంది. ఈ నెల 25న ఈ సినిమా టీజర్‌ని విడుదల చేస్తున్నాం. 2021లో సంక్రాంతికి సినిమా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: ప్రదీశ్‌ ఎమ్‌. వర్మ.

మరిన్ని వార్తలు