‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ నుంచి క్రేజీ అప్‌డేట్‌

11 Sep, 2021 21:15 IST|Sakshi

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. రొమాంటిక్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ రూపొందిచని ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించాడు. భ‌లే బన్నీ వాసు, మరో నిర్మాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ మూవీని నుంచి లెహరాయి లిరికల్ సాంగ్‌పై మేకర్స్‌  అప్‌డేట్‌. ఇందుకు సంబంధించిన పొస్టర్‌ విడుదల చేస్తూ సెప్టెంబర్ 15న ఈ రొమాంటిక్ సాంగ్ విడుదల కానుందని ప్రకటించింది. ఈ మేరకు అఖిల్, పూజ హెగ్డే రొమాంటిక్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు