Most Eligible Bachelor : ఇట్టకేలకు రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది..

28 Aug, 2021 11:11 IST|Sakshi

యంగ్ హీరో అక్కినేని అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌.  ఇప్పటికే షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకున్న ఈ చిత్రం కరోనా కారణంగా  రిలీజ్‌ వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా అక్టోబర్‌8న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌, టీజర్‌ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్‌ చేశాయి.

రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చర్స్‌ బ్యాన‌ర్‌పై బ‌న్నీవాసు, వాసువ‌ర్మ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆమ‌ని, ముర‌ళీశ‌ర్మ‌, వెన్నెల కిషోర్ మఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి గోపీసుంద‌ర్ సంగీతం అందిచారు. 

చదవండి: 'పుష్ప' విలన్‌ వచ్చేశాడు... భన్వర్‌ సింగ్‌ షెకావత్‌గా ఫహద్‌..లుక్‌ ఇదే
షూటింగ్‌ గ్యాప్‌లో.. దాని గురించి కల కంటున్న​ రాశీ ఖన్నా

మరిన్ని వార్తలు