Akhil Akkineni : దసరా పండక్కి వచ్చేస్తు‍న్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'

7 Sep, 2021 14:55 IST|Sakshi

యంగ్ హీరో అక్కినేని అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చర్స్‌ బ్యాన‌ర్‌పై బ‌న్నీవాసు, వాసువ‌ర్మ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బొమ్మరిల్లు భాస్కర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని అక్టోబర్‌8న థియేటర్స్‌లో విడుదల చేయనున్నట్లు ఇటీవలె ప్రకటించారు.

తాజాగా ఇదే విషయాన్ని ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌ మూవీపై భారీ అంచనాలను క్రియేట్‌చేసింది. విజయదశమి సందర్భంగా అక్టోబర్‌ 8న ఈ చిత్రం థియేటర్స్‌లో సందడి చేయనుంది. ఈ చిత్రంలో ఆమ‌ని, ముర‌ళీశ‌ర్మ‌, వెన్నెల కిషోర్ మఖ్యపాత్రలు పోషించారు. గోపీసుంద‌ర్ సంగీతం అందిచారు. 

చదవండి :బ్రేకింగ్‌ న్యూస్‌, భర్తపై దీపికా ఫిర్యాదు, రణవీర్‌ రొమాంటిక్‌ రిప్లై 
మాలీవుడ్‌ స్టార్‌ హీరోలలో అల్లు అర్జున్‌ ఎవరో తెలుసా?

మరిన్ని వార్తలు