అఖిల్‌ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌: అవాక్కైన బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌

28 Feb, 2021 13:47 IST|Sakshi

తెలుగు బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌కు రన్నర్‌ను, కానీ ప్రేక్షకుల మనసులను దోచుకున్న విన్నర్‌ను అని చెప్పుకుంటాడు అఖిల్‌ సార్థక్‌. ప్రస్తుతం అతడు తెలుగు అబ్బాయి - గుజరాత్‌ అమ్మాయి అనే వెబ్‌ సిరీస్‌ చేస్తున్నాడు. తాజాగా ఇతడు తమిళ బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌ కంటెస్టెంట్‌ సోమశేఖర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. అంతేకాకుండా అతడి ఫొటో ఫ్రేమ్‌ను ప్రత్యేక కానుకగా పంపించాడు. ఈ విషయాన్ని అతడు ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో అభిమానులతో పంచుకున్నాడు.

"హలో రాక్‌స్టార్‌, హ్యాపీ బర్త్‌డే. మనిద్దరికీ చాలా దగ్గర పోలికలున్నాయి. అందుకే ఇలా కనెక్ట్‌ అయిపోయాం. మా అమ్మది తమిళ్‌. అలా నాకు ఆ భాష కాస్తోకూస్తో అర్థమవుతుంది, కానీ మాట్లాడలేను. నేను తమిళ బిగ్‌బాస్‌ షో చూశాను. ఇద్దరం బిగ్‌బాస్‌ 4 నుంచి వచ్చినవాళ్లమే. లవ్‌ యూ రాక్‌స్టార్‌" అంటూ వీడియో సందేశం పంపాడు. ఇక అతడు పంపిన గిఫ్ట్‌ చూసి సోమశేఖర్‌ ఎంతగానో ఆశ్చర్యపోయాడు. "ఓ మై గాడ్‌, చాలా బాగుంది బ్రదర్‌" అంటూ త్వరలోనే కలుద్దామని చెప్పుకొచ్చాడు.

సోమశేఖర్‌ విషయానికొస్తే.. బాక్సింగ్‌ మ్యాచ్‌లో గోల్డ్‌ మెడల్‌, తమిళనాడు స్టేట్‌ లెవల్‌ మువైతాయ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో సిల్వర్‌ మెడల్‌ సాధించాడు. మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన ఆయన 'అజగియ తమిళ్‌ మ్యాగన్'‌ టీవీ షోలో తళుక్కున మెరిశాడు. బైకులను అమితంగా ప్రేమించే ఇతడు ఈ మధ్యే కమల్‌ హాసన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించిన తమిళ బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌లో పాల్గొని అందరి ఆదరాభిమానాలను అందుకున్నాడు. గ్రాండ్‌ ఫినాలేకు చేరుకున్న ఇతడు నాలుగో రన్నరప్‌గా నిలిచాడు.

చదవండి: అఖిల్‌ కొత్త కారు: షికారుకెళ్దామంటున్న సోహైల్‌

ఫ్రాంక్‌తో తల్లిని హడలుగొట్టిన కుమారులు

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు