'సైరా' ద‌ర్శ‌కుడితో అఖిత్ 5వ సినిమా

9 Sep, 2020 10:46 IST|Sakshi

క‌రోనా కార‌ణంగా బ్రేక్ ప‌డిన సినిమా షూటింగులు ఇప్పుడిప్పుడే ప‌ట్టాలెక్కుతున్నాయి. పెద్ద సినిమాలు సైతం చిత్రీక‌ర‌ణలో పాల్గొంటున్నాయి. ఈ నేప‌థ్యంలో అక్కినేని అఖిల్ కెరియ‌ర్‌లో 5వ సినిమా ఎవ‌రితో చేయ‌నున్నారు అనే స‌స్పెన్‌ను తెర‌దించుతూ  సినిమా వివరాల‌ను అఖిల్ అనౌన్స్ చేసేశాడు.  సైరా’తో సూపర్‌హిట్ కొట్టిన సురేందర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో అఖిల్ న‌టించ‌నున్నారు. మ‌రికొద్ది రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్‌ని ప్రారంభిస్తార‌ని స‌మాచారం. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, సురేంద‌ర్ 2 సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇంతవరకూ సరైన హిట్ ఖాతాలో వేసుకోలేకపోయిన అఖిల్.. త‌న ఐద‌వ సినిమాతో ఎలాగైనా భారీ హిట్ కొట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నాడు. ('భీష్మ' డైరెక్ట‌ర్‌కు ల‌గ్జ‌రీ కారు గిఫ్ట్ ఇచ్చిన నితిన్)

స్టయిలిష్‌ ఎంటర్‌టైనర్‌లను తెరకెక్కించడంలో సురేందర్‌ రెడ్డి స్పెషలిస్ట్‌. ఇటీవలే ‘సైరా’తో చారిత్రాత్మక సినిమాతోనూ హిట్‌ సాధించి తన సత్తా చాటారు. మ‌రి ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వ‌చ్చే సినిమా కాబ‌ట్టి  మంచి స్టయిలిష్‌ సినిమానే రాబోతుంద‌న్న‌మాట. ఇక బొమ్మరిల్లు  భాస్కర్‌ దర్శకత్వంలో అఖిల్‌ హీరోగా ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ అనే చిత్రం ద‌స‌రాకు విడుద‌ల చేయాల‌ని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. (రాదే ఓటీటీలోకి రాదు)


 

మరిన్ని వార్తలు