Akkineni Naga Chaitanya: తంతడి బీచ్‌లో నాగచైతన్య సందడి 

8 Jul, 2022 09:46 IST|Sakshi
అభిమానులను పలకరిస్తున్న నాగచైతన్య

అచ్యుతాపురం(అనకాపల్లి): అక్కినేని నాగచైతన్య హీరోగా నిర్మితమవుతున్న నూతన చిత్రం షూటింగ్‌ తంతడి బీచ్‌లో ప్రారంభమైంది. తీరంలోని రెండు కొండల మధ్య ఏర్పాటు చేసిన సెట్టింగ్‌ చూపరులను ఆకట్టుకుంటోంది. పది రోజులపాటు కష్టపడి సెట్టింగ్‌ నిర్మించారు. గురువారం ఉదయం నుంచి షూటింగ్‌ జరుగుతుందని తెలియడంతో సమీప ప్రాంతాల ప్రజలు నాగ చైతన్యను చూసేందుకు తరలివచ్చారు. మరో మూడు రోజులపాటు షూటింగ్‌ జరగనున్నట్లు సమాచారం.
చదవండి: మహారాజా సుహేల్‌ దేవ్‌గా రామ్‌చరణ్‌!

మరిన్ని వార్తలు