మాజీ ప్రియుడు యాసిడ్‌ దాడికి ప్రయత్నించాడు: బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌

12 Sep, 2021 17:41 IST|Sakshi

హిందీ బిగ్‌బాస్‌ ఓటీటీ కంటెస్టెంట్‌, భోజ్‌పురి ఫేమ్‌ అక్షర సింగ్‌ ఈ మధ్యే వీకెండ్‌ కా వార్‌ ఎపిసోడ్‌లో షో నుంచి ఎలిమినేట్‌ అయింది. తాజాగా ఆమె జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మాజీ ప్రియుడి వల్ల నరకం చూశానని చెప్పుకొచ్చింది. తనపై యాసిడ్‌ దాడి చేయించేందుకు అతడు కుట్ర పన్నాడని, కెరీర్‌ నాశనం చేసేందుకు అన్నివిధాలా ప్రయత్నించాడని చెప్తూ కన్నీటిపర్యంతమైంది.

'ఒకరోజు రోడ్డుపై ఒంటరిగా వెళ్తుండగా కొందరు యాసిడ్‌ బాటిళ్లతో నాపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. వీధుల్లో డ్రగ్స్‌ తీసుకునేవారిని నాపై దాడి చేసేందుకు నియమించాడు. అంతే కాదు, నా కెరీర్‌ను నాశనం చేస్తానని, నన్ను ప్రాణాలతో వదిలిపెట్టనని మాజీ ప్రియుడు తరచూ బెదిరించేవాడు. దీంతో నేను డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. కానీ నా తండ్రి మాటలు నాలో కొత్త ధైర్యాన్ని నింపాయి. గతాన్ని మర్చిపోయి పరిస్థితులతో పోరాడమని, ఈ పోరాటంలో నా వెంట ఉంటానంటూ బతికి చూపించమన్నాడు. ఆయన చెప్పిన మాటలతో మానసికంగా బలాన్ని కూడదీసుకున్నాను. ఇక అప్పటినుంచి ఎప్పుడూ వెనుదిరిగి చూసుకోలేదు. కానీ నా జీవితంలో  ఎదుర్కొన్న  దారుణమైన పరిస్థితులు ఏ అమ్మాయికి ఎదురవకూడదని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అని చెప్పుకొచ్చింది.

చదవండి: Bigg Boss: ప్రియుడిని తలుచుకుని వెక్కి వెక్కి ఏడ్చిన శిల్పా సోదరి

ఇండస్ట్రీలో అవకాశాల గురించి మాట్లాడుతూ.. 'పరిశ్రమ నుంచి నాకు సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. కొందరు నన్ను ఓదార్చడానికి వచ్చారు.. కానీ నేను అలా ఉన్నాను, ఇలా ఉన్నాను, అందుకే నాకిలా జరుగుతోందని చెప్పారే తప్ప ఎవరూ సపోర్ట్‌ చేయలేదు. మొత్తం ఇండస్ట్రీ ఒకవైపు, ఒంటరిగా నేనొకవైపు ఉన్నాను. ఏ కారణం చెప్పకుండానే నాకు పనివ్వడం మానేశారు. చేతిలో ఏ పనీ లేదు. ఆ సమయంలో ముంబైలో ఎలా బతికాను అన్నది నాకు, నా కుటుంబానికి మాత్రమే తెలుసు'

'అప్పుడే మ్యూజిక్‌ ఆల్బమ్స్‌ చేయడం ప్రారంభించాను. నేను సంపాదించినదానితో పాటు అప్పు తీసుకొచ్చి మరీ దానిపై ఖర్చు పెట్టాను. ఎందుకంటే నాకిక సినిమా అవకాశాలు రావని అర్థమైంది. ఎందుకంటే ఆల్‌రెడీ నేను సంతకం చేసిన సినిమాల్లో నుంచి కూడా నిర్దాక్షిణ్యంగా నన్ను తీసివేశారు. అందుకే సొంతంగా మ్యూజిక్‌ ఆల్బమ్స్‌ చేయడం మొదలుపెట్టాను. దీనికి ప్రశంసలు దక్కడంతో పాటు డబ్బులు కూడా వచ్చాయి. అయితే నా పాటలు ఏ మ్యూజిక్‌ కంపెనీ తీసుకోకుండా నా మాజీ ప్రియుడు వారి మీద ఒత్తిడి తెచ్చాడు. నన్ను బతకనివ్వకూడదన్నది అతడి కోరిక. కానీ నేను వెనుకడుగు వేయలేదు. నేనే సొంతంగా కంపెనీ పెట్టి నా పాటలను నేనే లాంచ్‌ చేయాలని డిసైడ్‌ అయ్యాను' అని చెప్పుకొచ్చింది నటి అక్షర సింగ్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు