థియేటర్లలోనే అక్షయ్‌ ‘బెల్‌బాటమ్‌’, విడుదల తేదీ ఎప్పుడంటే..

15 Jun, 2021 15:52 IST|Sakshi

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ తన అభిమానులకు శభవార్తను అందించాడు. ఆయన నటించిన ‘బెల్‌బాటమ్’ చిత్రం జూలై 27వ తేదిన థియేటర్లలోకి రానున్నట్లు ఆయన తాజాగా ప్రకటించారు. గతేడాది షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ భారీ చిత్రాన్ని 2020 లాక్‌డౌన్‌ కారణంగా ఓటీటీలో విడుదల చేయాలని మేకర్స్‌ నిర్ణయించారు. అయితే ఏమైందో కానీ ఇప్పటి వరకు దాని గురించి ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వలేదు. అయితే ప్రస్తుతం పరిస్థితులు సాధారణ స్థితికి వస్తుండటంతో దేశవ్యాప్తంగా థియేటర్లు తెరుచుకునే అవకాశం కనిపిస్తోంది. దీంతో బెల్‌బాటమ్‌ను స్మాల్‌ స్క్రీన్‌పై కాకుండా బిగ్‌స్క్రీన్‌పైనే విడుదల చేయాలని మేకర్స్‌ నిర్ణయించారట. 

బాలీవుడ్‌కు దాదాపు 60 శాతం రెవెన్యూ ఇచ్చే ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో ఫస్ట్‌ లాక్‌డౌన్‌ నుంచి ఇప్పటి వరకు థియేటర్లు తెరుచుకోలేదు. ఇక ‘బెల్‌బాటమ్‌’ మూవీ మేకర్స్‌ తాజా నిర్ణయింతో అక్కడ థియేటర్లు తెరుచుకోనున్నాయని స్పష్టమైంది. ఈ సినిమాతో పాటు మరిన్ని బాలీవుడ్‌ పెద్ద సినిమాలు ‘సూర్యవంశీ, పృథ్వీరాజ్‌, జెర్సీ, 83, సత్యమేవ జయతే, గంగూబాయ్‌, లాల్‌సింగ్‌ చద్దా, కథియావాడి, పఠాన్‌ వంటి చిత్రాలు కూడా విడుదలకు సిద్దంగా ఉన్నాయి. అన్ని కూడా స్టార్‌ హీరోహీరోయిన్ల చిత్రాలే కావడంతో ఇక బీ-టౌన్‌ థియేటర్లలో సందడి నెలకొననుంది. కాగా ఇప్పటికే అమెరికాలోని మార్కేట్లన్నీ తెరుచుకోవ‌డంతో ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియ‌స్ 9’, ‘క్వైట్ ప్లేస్ 2’, ‘కంజూరింగ్ 3’ లాంటి హాలీవుడ్ చ్రితాలు విడుదలయ్యాయి. త్వరలోనే ఈ సినిమాలు ఇండియాకు కూడా రానున్నాయి.

మరిన్ని వార్తలు