KK Singer Death: సింగర్‌ కేకే మృతిపై అక్షయ్‌, ఆర్‌ రెహమాన్‌ ఆవేదన

1 Jun, 2022 17:41 IST|Sakshi

ప్రముఖ సింగర్‌ కేకే (కృష్ణకుమార్‌ కున్నత్‌) మంగళవారం రాత్రి మరణించిన సంగతి తెలిసిందే. ఆయన హాఠాన్మరణం సినీ పరిశ్రమలో మరోసారి విషాదం చోటుచేసుకుంది. సిద్ధూ మూసేవాలా హత్యోదంతం జరిగిన రెండు రోజులకే మరో ప్రముఖ గాయకుడి అకాల మరణం యావత్ సినిమా ప్రపంచాన్ని షాక్ కు గురిచేసింది. ఆయన మృతి సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఇక బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ కేకే మృతిపై ఆవేదన వ్యక్తం చేశారు.  ‘నా కెరీర్‌లో కేకే కూడా ఒక భాగం. నేను చేసిన చిత్రాలకు సంబంధించిన ఎన్నో పాటలకు స్వరాన్ని అందించారు.

ఆయన ఆలపించిన ‘తూ బోలా జైసే’ పాట వల్లే ఎయిర్ లిఫ్ట్ మూవీ క్లైమాక్స్ చక్కగా వచ్చింది. గత రాత్రి జరిగిన ఘటన నిజంగా షాకింగ్‌గా ఉంది’ అని పేర్కొన్నారు. అలాగే బాలీవుడ్‌ సింగర్‌ విశాల్‌ దడ్లానీ తీవ్ర దిగ్భ్రాంతీ వ్యక్తం చేస్తున్నారు. కేకే మరణవార్త తెలిసినప్పటి నుంచి ఆయన వరుస ట్వీట్స్‌ చేస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా మిత్రలకు, సన్నిహితలకు ఓ విజ్ఞప్తి చేశారు. ‘స్నేహితులకు, మీడియా మిత్రలకు నా విన్నపం ఏంటంటే. కేకే గురించి మాట్లాడమని గాని, స్టేట్‌మెంట్‌ ఇవ్వమని గాని నన్ను అడగకండి ప్లీజ్‌. ఎందుకంటే ప్రస్తుతం ఆయన గురించి నేను మాట్లాడే పరిస్థితుల్లో లేను. నాకంత శక్తి కూడా లేదు’ అంటూ రాసుకొచ్చారు.

వీరితో పాటు పలువకు బాలీవుడ్‌ హీరోలు, మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఏఆర్‌ రెహమాన్‌ తదితరులు సంతాపం ప్రకటించారు. కాగా కేకే 1968లో ఢిల్లీలో జన్మించారు. కేకే మృతికి ప్రధాని నరేంద్ర మోదీ, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా వంటి తదితర ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కలతాలోని నజ్రుల్ మంచ్ వద్ద మంగళవారం రాత్రి ప్రదర్శన ఇచ్చిన అనంతరం కేకే అస్వస్థతకు గురి కాగా, ఆయన్ను సీఎంఆర్ఐ హాస్పిటల్ కు తరలించారు. కాని, అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు ప్రకటించడం తెలిసిందే. కేకే మృతిని అసహజ మరణం కేసుగా నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

A post shared by Ranveer Singh (@ranveersingh)

మరిన్ని వార్తలు