YRF Special Poster For Akshay Kumar: అక్షయ్​ కుమార్​ సినీ కెరీర్​కు 30 ఏళ్లు.. ఊహించని సర్​ప్రైజ్​ వైరల్​

4 May, 2022 20:12 IST|Sakshi

Akshay Kumar Completes 30 Years In Bollywood YRF Special Poster: బాలీవుడ్ స్టార్​ హీరో అక్షయ్‌ కుమార్‌ సినిమా కోసం ప్రాణం పెట్టి నటిస్తాడు. సన్నివేశం బాగా వచ్చేందుకు ఎలాంటి రియల్‌ స్టంట్స్‌ అయిన చేస్తాడు. అలా ఆయన చేసిన స్టంట్స్​ ఎన్నో ఉన్నాయి. అందుకే ఆయన్ను యాక్షన్‌ హీరో అని ముద్దుగా పిలుచుకుంటుంది బీటౌన్‌. ఇటీవల 'సూర్యవంశీ', 'ఆత్రంగి రే', 'బచ్చన్‌ పాండే' చిత్రాలతో ప్రేక్షకులను, అభిమానులను అలరించాడు అక్కీ. తాజాగా ఈ యాక్షన్​ హీరో హిందీ చిత్ర పరిశ్రమలో 30 వసంతాలు పూర్తి చేసుకున్నాడు. 

అక్షయ్​ కుమార్​ తొలి చిత్రం 'సౌగంధ్' 1991లో విడుదలైంది. ప్రస్తుతం పరాక్రమవంతుడు పృథ్వీరాజ్ చౌహన్​ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న 'పృథ్వీరాజ్'​ సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. ఈ మూవీని 'యశ్ రాజ్​ ఫిలీంస్'​ బ్యానర్​పై ఆదిత్య చోప్రా నిర్మించారు. డాక్టర్​ చంద్రప్రకాష్​ ద్వివేది ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే అక్షయ్​ కుమార్​ సినీ ఇండస్ట్రీలో 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా యశ్​ రాజ్​ ఫిలీంస్​ అక్షయ్​కు ఊహించని సర్​ప్రైజ్​ ఇచ్చింది. 

చదవండి: కశ్మీర్‌ ఫైల్స్‌ నా సినిమాను దెబ్బకొట్టింది: అక్షయ్‌ కుమార్‌

A post shared by Yash Raj Films (@yrf)


అక్షయ్​ కుమార్​కు కానుకగా 'పృథ్వీరాజ్'​ సినిమా కొత్త పోస్టర్​ను ఆవిష్కరించింది. ఈ పోస్టర్​ను పృథ్వీరాజ్​ పాత్రలో ఉన్న అక్షయ్ ఫొటోతో పాటు ఆయన కెరీర్​లోని అన్ని చిత్రాలతో రూపొందించారు. ఈ కానుకకు అక్షయ్​ వీడియో రూపంలో కృతజ్ఞతలు తెలిపాడు. ఇందులో 'నా సినీ ప్రయాణం ప్రారంభమై 30 ఏళ్లు గడిచింది అంటే నమ్మలేకపోతున్నాను. నా తొలి చిత్రం సౌగంధ్​ 30 ఏళ్లు పూర్తి చేసుకోవడం చాలా మనోహరంగా ఉంది. నా సినీ కెరీర్​లో మొదటి షాట్​ ఊటీలో జరిగింది. అది కూడా యాక్షన్ షాట్​. ఈ పోస్టర్​కు ధన్యవాదాలు. ఇది నిజంగా నాకు చాలా ప్రత్యేకమైనది.' అని తెలిపాడు ఈ యాక్షన్​ హీరో అక్కీ. ప్రస్తుతం ఈ సర్​ప్రైజ్​ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. 

చదవండి: అక్షయ్ కుమార్ పాజిటివ్‌ మంత్ర.. సూర్యుడికి శుభాకాంక్షలు

మరిన్ని వార్తలు