'ఓ మై గాడ్‌-2' సీక్వెల్‌పై క్లారిటీ వచ్చేసింది..

7 Jun, 2021 00:44 IST|Sakshi

హిందీ హిట్‌ ‘ఓఎమ్‌జీ: ఓ మై గాడ్‌’ (2012) చిత్రానికి సీక్వెల్‌గా ‘ఓఎమ్‌జీ: ఓ మై గాడ్‌ 2’ రూపొందనుందనే టాక్‌ బీ టౌన్‌లో ఎప్పట్నుంచో వినిపిస్తూనే ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, దర్శకుడి విషయంలో నెలకొన్న కన్‌ఫ్యూజన్‌పై తాజాగా క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. ఉమేష్‌ శుక్లా దర్శకత్వం వహించిన ‘ఓఎమ్‌జీ: ఓ మై గాడ్‌’ (2012) చిత్రంలో అక్షయ్‌కుమార్, పరేష్‌ రావల్, మిథున్‌ చక్రవర్తి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా సీక్వెల్‌లో అక్షయ్‌కుమార్, పంకజ్‌ త్రిపాఠి ప్రధాన పాత్రలు పోషించనున్నట్లు బాలీవుడ్‌ టాక్‌. ‘రోడ్‌ టు సంగం’ ఫేమ్‌ అమిత్‌ రాయ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. వచ్చే ఏడాది మొదట్లో షూటింగ్‌ ప్రారంభించాలని అనుకుంటున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘ఓ మై గాడ్‌’ తెలుగులో ‘గోపాల గోపాల’ (2015)గా రీమేక్‌ అయిన సంగతి గుర్తుండే ఉంటుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు