తిరుగులేదని నిరూపించుకున్న ‘ఖిలాడీ’!

8 Aug, 2020 13:08 IST|Sakshi

బాలీవుడ్‌ ఖిలాడీ అక్షయ్‌ కుమార్‌ మరోసారి ఇండియా నెంబర్‌ 1 హీరోగా నిలిచాడు. బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ను వెనక్కి నెట్టి 24 శాతం ఓట్లతో అగ్రస్థానం సొంతం చేసుకున్నాడు. ఇండియా టుడే నిర్వహించిన ‘మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌’ సర్వేలో తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. కాగా సామాజిక సందేశం కలిగిన సినిమాల్లో నటించడంతో పాటు సమాజ సేవలోనూ అక్కీ తన వంతు పాత్ర పోషిస్తాడన్న సంగతి తెలిసిందే.

గతంలో ఎంతో మందికి సాయం చేసి పెద్ద మనసు చాటుకున్న అక్షయ్‌.. ప్రాణాంతక కరోనా వైరస్‌పై పోరులో భాగంగా తొలుత రూ. 25 కోట్లు(పీఎం కేర్స్‌), ఆ తర్వాత మరో మూడు కోట్ల విరాళం అందజేశాడు. ప్రస్తుతం అతడు ‘బెల్‌ బాటమ్‌’, ‘రక్షా బంధన్‌’ తదితర సినిమాల్లో నటిస్తున్నాడు. ఇక ఈ జాబితాలో ఖాన్‌ల త్రయానికి టాప్‌-5లో చోటు దక్కింది.(ఇండియా నంబర్‌ 1 హీరోయిన్‌ ఎవరంటే!)

టాప్‌- 10 జాబితాలో చోటు దక్కించుకున్న హీరోలు
1. అక్షయ్‌ కుమార్‌-24 శాతం
2. అమితాబ్‌ బచ్చన్‌- 23
3. షారుఖ్‌ ఖాన్‌- 11
4. సల్మాన్‌ ఖాన్‌- 10
5. ఆమిర్‌ ఖాన్‌-6
6. ఇతరులు- 6 శాతం
7. అజయ్‌ దేవ్‌గణ్‌-4
8. హృతిక్‌ రోషన్‌-4
9. రణ్‌వీర్‌ సింగ్‌-4
10. రణ్‌బీర్‌ కపూర్‌-2

కాగా ఈ ఫలితాలు చూసిన కొంతమంది నెటిజన్లు ఈ విభాగంలో ‘రీల్‌ విలన్‌’,‘రియల్‌ హీరో’ సోనూ సూద్‌ పేరు కూడా చేరిస్తే బాగుండేది కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా