Prithviraj Movie Teaser: అక్షయ్‌ కుమార్‌ 'పృథ్వీరాజ్‌' టీజర్ రిలీజ్‌..

15 Nov, 2021 11:44 IST|Sakshi

బాలీవుడ్ హీరో అక్షయ్‌ కుమార్‌ తాజా చిత్రం ‘పృథ్వీరాజ్‌’. ఈ మూవీ టీజర్‌ను తాజాగా మేకర్స్‌ విడుదల చేశారు. చంద్రప్రకాష్‌ ద్వివేది దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంజయ్ దత్‌, అశుతోష్‌ రాణా, సోనూ సూద్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మిస్‌ వరల్డ్‌ 2017 మానుషి చిల్లర్‌ ఈ సినిమాతో బాలీవుడ్‌లో తెరంగ్రేటం చేయనుంది.

పృథ్వీరాజ్‌ చౌహాన్‌ పాత్రను అక్షయ్‌ కుమార్‌ అద్భుతంగా పోషించిన తీరు ఈ టీజర్‌లో కనిపిస్తుంది. ‘పృథ్వీరాజ్‌’తో యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ మొదటిసారిగా చారిత్రక నేపథ్యమున్న సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాను ధైర్యవంతమైన, శక్తివంతమైన యోధుడు పృథ్వీరాజ్‌ చౌహాన్‌ జీవితం, అతని పరాక్రమం ఆధారంగా నిర్మిస్తున్నారు. 

చదవండి: నేడు రాజ్ కుమార్‌ రావు, పత్రలేఖ వివాహం.. వెడ్డింగ్‌ కార్డ్‌ వైరల్‌

ఈ సందర్భంగా అక్షయ్‌ కుమార్‌ మాట్లాడుతూ ‘ఈ టీజర్‌ సినిమా ఆత్మను ప్రతిబింబిస్తుంది. భయమే తెలియని ఒక లెజెండరీ యోధుడు సామ్రాట్‌ పృథ్వీరాజ్‌ చౌహాన్‌ జీవిత సారాన్ని తెలియజేస్తుంది. ఆయన జీవితానికి ఇదే మా నివాళి. నేను ఆయన గురించి ఎంతగానో చదివాను. పృథ్వీరాజ్‌ చౌహాన్‌ గురించి తెలుసుకున్న కొద్ది నాకు ఆశ్చర్యం వేసింది. ఆయన దేశం, విలువల కోసం ప్రతి క్షణం జీవించారు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ సినిమా జనవరి 21, 2022న థియేటర్లలో సందడి చేయనుంది. ఇందులో మానుషి చిల్లర్‌ సంయోగిత పాత్రలో నటించనుంది. చంద్రప్రకాష్‌ ద్వివేది ఇంతకుముందు టెలివిజన్‌ షో చాణక్య, పింజర్‌ చిత్రాలకు దర్శకత్వం వహించారు. 

చదవండి: ఏడేళ్ల గ్యాప్‌, ఇప్పుడు పెళ్లికి రెడీ అయిన బుల్లితెర న‌టి!

మరిన్ని వార్తలు