Ram Setu Teaser: ఆర్కియాలజిస్ట్‌గా అక్షయ్ కుమార్.. రామ్‌ సేతు టీజర్ అదుర్స్

26 Sep, 2022 16:57 IST|Sakshi

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ అడ్వెంచరస్ చిత్రం 'రామ్ సేతు'. ఈ సినిమాలో ఆయన ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఆర్కియాలజిస్ట్‌ పాత్రలో అక్షయ్ కుమార్ లుక్ అదిరిపోయింది. రామ్‌ సేతు విశిష్టత, దాన్ని రక్షించేందుకు ఆర్కియాలజిస్ట్ చేసే సాహసోపేతమైన జర్నీ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 25న ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి అభిషేక్‌ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు.

(చదవండి: ఓటీటీలోకి 'ఒకే ఒక జీవితం' మూవీ.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..)

'రామ్‌ సేతు'ను కాపాడేందుకు మన చేతుల్లో కేవలం మూడు రోజులు మాత్రమే ఉన్నాయి' అనే అక్షయ్‌ కుమార్  డైలాగ్‌తో మొదలైన టీజర్‌.. విజువల్స్‌ కట్టిపడేలా ఉన్నాయి. నీటి అడుగున ఉన్న రామసేతును చూసేందుకు అతను ప్రత్యేకమైన సూట్‌లో వచ్చి నీటి అడుగున డైవింగ్ చేస్తున్న సీన్లు ఆకట్టుకుంటున్నాయి. బ్లాక్ సూట్‌లో నాజర్‌ గ్లింప్స్ హైలెట్‌గా ఉన్నాయి. రామ్‌ సేతుని చేరుకోవడానికి తన బృందంతో కలిసి అక్షయ్‌ చేసే సాహసాలను టీజర్‌లో చూపించారు. జాక్వెలిన్‌ కథానాయికగా నటించనుండగా.. తెలుగు హీరో సత్యదేవ్‌ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. 

మరిన్ని వార్తలు