రామమందిర నిర్మాణానికి అక్షయ్ విరాళం

18 Jan, 2021 13:35 IST|Sakshi

ముంబయి: అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి అవసరమయ్యే విరాళాలను సేకరణను రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్‌ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజకీయ నాయకులతో పాటు, పలువురు సెలెబ్రిటీలు కూడా తమ వంతు విరాళాలు అందించేందుకు ముందుకు వస్తున్నారు. తాజాగా అయోధ్యలో రామ్ మందిర్ నిర్మాణానికి సహకారం అందించాలని అభిమానులు, అనుచరులను కోరుతూ నటుడు అక్షయ్ కుమార్ ఒక వీడియోను పంచుకున్నారు. తన వంతు కర్తవ్యంగా కొత్త మొత్తాన్ని అందించినట్లు వీడియోలో పేర్కొన్నాడు. ప్రతి ఒక్కరూ ఆలయ నిర్మాణంకు తమకు తోచినంత సహాయం అందించాలని పేర్కొన్నాడు.(చదవండి: నా గురించే ఆలోచిస్తున్నావా?: సమంత)

ఇటీవలే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆలయ నిర్మాణానికి రామజన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు బృందాన్ని కలిసి 5 లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు చెక్ ను ఆ బృందానికి అందజేశారు. హీరోయిన్ ప్రణీత కూడా రామ మందిర నిర్మాణానికి లక్ష రూపాయల విరాళాన్ని ప్రకటించింది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియజేసింది. దేశీయ విరాళాల ద్వారానే రామ్ మందిర్ నిర్మాణం పూర్తవుతుందని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రకటించింది. దేశంలోని 5,25,000 గ్రామాలలో నిధుల సేకరణ ప్రచారం జరగనుంది. సేకరించిన డబ్బును 48 గంటలలోపు బ్యాంకుల్లో జమ చేయాలి. ఈ కలెక్షన్ డ్రైవ్ జనవరి 15న నుంచి ఫిబ్రవరి 27 వరకు కొనసాగుతుంది. రామమందిరం నిర్మాణం 36 నెలల నుంచి 40 నెలల సమయంలో పూర్తవుతుందని ట్రస్టు సభ్యులు తెలిపారు.


 

మరిన్ని వార్తలు