నాన్‌స్టాప్‌ కుమార్‌

13 Oct, 2020 00:30 IST|Sakshi

లాక్‌డౌన్‌లో సినిమాల చిత్రీకరణను ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని చేయాలా? అని చాలామంది ఆలోచిస్తుంటే ‘బెల్‌ బాటమ్‌’ సినిమాను ప్రారంభించారు బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌. ప్రారంభించడమే కాదు లాక్‌డౌన్‌లో పూర్తి చేసేశారు కూడా. తాజాగా ‘పృథ్వీరాజ్‌’ సినిమా సెట్లో జాయిన్‌ అయ్యారు. అక్షయ్‌ కుమార్, సోనూ సూద్, మనూషీ చిల్లర్, సంజయ్‌ దత్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న పీరియాడికల్‌ చిత్రం ఇది. యశ్‌ రాజ్‌ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ తాజాగా ప్రారంభం అయింది. సోనూ సూద్, అక్షయ్‌ కుమార్‌లపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. కొన్ని రోజుల్లో మనూషీ కూడా సెట్లో జాయిన్‌ అవ్వనున్నారు. సినిమా పూర్తయ్యే వరకూ నాన్‌స్టాప్‌గా చిత్రీకరణ కొనసాగనుంది. ఇలా ఒక సినిమా తర్వాత ఇంకో సినిమా షూటింగ్‌లో పాల్గొంటూ బిజీగా ఉంటున్న అక్షయ్‌ కుమార్‌ని కొందరు ‘నాన్‌స్టాప్‌ కుమార్‌’ అంటున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు