రోజు ఉదయం ఆవు మూత్రం తాగుతా..

10 Sep, 2020 19:32 IST|Sakshi

సంచలన విషయాలు వెల్లడించిన ఖిలాడీ హీరో

ఆవు మూత్రానికి భారతీయ సంస్కృతిలో చాలా ప్రాధాన్యత ఉంది. ఇప్పటికి గ్రామాల్లో చిన్న పిల్లలకు ఆవు పంచకంతో ఒక్కసారి అయిన స్నానం చేయిస్తారు. ఇక చాలా మంది దీన్ని సేవిస్తారు. ఈ నేపథ్యంలో హీరో అక్షయ్‌ కుమార్‌ తాను ప్రతి రోజు ఆవు మూత్రం తాగుతానని తెలిపి ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచారు. ఆయుర్వేద పరంగా ఇది ఎంతో మంచిదన్నారు. అసలు ఈ టాపిక్‌ ఎందుకు వచ్చిందంటే.. అక్షయ్‌ ‘ది వైల్డ్‌ విత్‌ బేర్‌ గ్రిల్స్‌’ షోలో పాల్గొన్న సంగతి తెలిసిందే. దానిలో భాగంగా ఏనుగు మలవిసర్జనతో చేసిన టీని తాగారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం బేర్‌ గ్రిల్స్‌, హ్యూమా ఖురేషిలతో ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ చాట్‌లో పాల్గొన్నారు అక్షయ్‌. దానిలో భాగంగా హ్యుమా ఖురేషి ‘ఆ ప్రత్యేకమైన టీని తాగమని అక్షయ్‌ని ఎలా ఒప్పించారని’ బేర్‌ గ్రిల్స్‌ని అడిగింది. అందుకు ‘ఆ పని ఎలా జరిగిందో నాకు తెలియదు. కానీ చెడ్డ పని మాత్రం కాదు’ అన్నారు బేర్‌ గ్రిల్స్‌. (చదవండి: రజనీ రియాలిటీ షోకు అత్యధిక రేటింగ్‌)

ఇంతలో అక్షయ్‌ ‘నేను ప్రతి రోజు ఆము మూత్రం తాగుతాను. కాబట్టి ఈ టీ తాగడానికి నేను పెద్దగా భయపడలేదు.. ఆశ్చర్యపడలేదు’ అని తెలిపారు. అక్షయ్‌ ఆవు మూత్రం తాగుతానని తెలపడం ఇదే ప్రథమం. ఈ సమాధానంతో హ్యుమా ఖురేషీతో పాటు నెటిజనులు కూడా ఆశ్చర్యపోయారు. అక్షయ్‌ మాట్లాడుతూ.. ‘ఆయుర్వేదపరంగా ఆవు మూత్రం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే నేను ప్రతి రోజు సేవిస్తాను. ఏనుగు వ్యర్థాలతో చేసిన టీ కూడా ఆయుర్వేదపరంగా మంచిదే. అందుకే తాగడానికి ఇబ్బంది పడలేదు’ అని తెలిపారు. ఇక ‘ది వైల్డ్ విత్ బేర్ గ్రిల్స్’ షో‌ రేపు (సెప్టెంబర్ 11) రాత్రి 8 గంటలకు డిస్కవరీ ప్లస్ చానల్‌లో.. సెప్టెంబర్ 14 న రాత్రి 8 గంటలకు డిస్కవరీ చానల్‌లో టెలికాస్ట్‌ అవుతుంది. 

@beargrylls @iamhumaq @discoveryplusindia @discoverychannelin

A post shared by Akshay Kumar (@akshaykumar) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు