మ్యాజిక్‌ చూపిస్తానంటున్న అక్షయ్‌ ‌

28 Mar, 2021 09:04 IST|Sakshi

‘అత్రంగీ రే’ సినిమాలో తన మ్యాజిక్‌ ఏంటో చూపిస్తానంటున్నారు హీరో అక్షయ్‌కుమార్‌. ఆనంద్‌ ఎల్‌. రాయ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ధనుష్, సారా అలీఖాన్‌ ప్రధాన పాత్రధారులు. శనివారంతో ఈ సినిమా షూటింగ్‌కు బైబై చెప్పారు అక్షయ్‌ కుమార్‌. ఈ సందర్భంగా అక్షయ్‌  మాట్లాడుతూ–‘‘అత్రంగీ రే’ సినిమా సెట్‌లో నాకు శనివారమే ఆఖరు రోజు. దర్శకుడు ఆనంద్‌ ఎల్‌. రాయ్‌ క్రియేట్‌ చేసిన మ్యాజిక్‌ను మీరు (ఆడియన్స్‌) చూస్తారు. ఈ బ్యూటిఫుల్‌ ఫిల్మ్‌లో భాగమైన ధనుష్, సారా అలీఖాన్‌లకు ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు అక్షయ్‌కుమార్‌. ఈ ఏడాది ఆగస్టు 6న ఈ సినిమా విడుదల కానుంది. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు