క‌న్నీళ్లు పెట్టుకుంటూ అభ్యర్థించా: అక్ష‌య్‌

20 Aug, 2020 10:49 IST|Sakshi

ఒకప్పుడు బాలీవుడ్‌ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్‌కు సినిమాల్లోకి రావాలన్న‌ది చిరకాల కోరిక‌. ఇందుకోసం ‘జో జీతా వొహి సికంద‌ర్’ సినిమా ఆడిష‌న్స్‌కు కూడా వెళ్లారు, కానీ సెల‌క్ట్ అవ‌లేదు. దీంతో మోడ‌లింగ్ చేసుకుంటూ కాలం వెళ్ల‌దీస్తున్న స‌మ‌యంలో ఓ ప్రాజెక్ట్ నుంచి అనూహ్యంగా ఆయ‌న్ను త‌ప్పించారు. కానీ ఇదే ఆయ‌న జీవితాన్ని కీల‌క మ‌లుపు తిప్పింది. ఈ విష‌యం గురించి ఓ ఇంట‌ర్వ్యూలో అక్ష‌య్ మాట్లాడుతూ.. ‘ఓ మోడ‌లింగ్ ప్రాజెక్ట్ గురించి నేను సాయంత్రం ఆరింటికి బెంగ‌ళూరు వెళ్లాల్సి ఉంది. కానీ ఆ రోజు ఉద‌యం 5.10 నిమిషాల‌కు ఫోన్ వ‌చ్చింది. 'అన్‌ప్రొఫెష‌న‌ల్‌గా ఉండే నీలాంటివాళ్లు విజ‌యం సాధించ‌లేరు. అందుకు నేను గ్యారంటీ ఇస్తాను' అని ఏజెంట్ ఫోన్‌లో ఘాటుగా మాట్లాడాడు. ఆ త‌ర్వాత అస‌లు సంగ‌తి అర్థ‌మైంది. నేను వెళ్లాల్సింది సాయంత్రం ఆరుకు కాదు, ఉద‌యం ఆరింటికి అని. నేను స‌రిగా చ‌ద‌వ‌కుండా పొర‌పాటు ప‌డ్డాను. (బాలీవుడ్‌ బంగారు గని)

‘క‌న్నీళ్లు పెట్టుకుంటూ వారిని అభ్య‌ర్థించాను. ఈ క్ష‌ణ‌మే అక్క‌డికి బ‌య‌లు దేరతాన‌ని, కానీ వాళ్లు ఒప్పుకోలేదు. ఆ త‌ర్వాత అదే రోజు నేను న‌ట‌రాజ్ స్టూడియోకు వెళ్లాను. అక్క‌డ ద‌ర్శ‌క నిర్మాత ప్ర‌మోద్ చ‌క్ర‌వ‌ర్తి వెంట‌నే నాకు మూడు సినిమాల్లో అవ‌కాశం ఇచ్చారు. మొద‌టి చిత్రానికి 50 వేలు, రెండో సినిమాకు ల‌క్ష‌, మూడో దానికి ల‌క్షా 50 వేల‌కు సంత‌కం చేశాను. నేను విమానం ఎక్కాల‌నుకున్న ఆరు గంట‌ల‌కే ఆయ‌న నాకు రూ.5 వేల చెక్ ఇచ్చారు. నేనుగానీ పొర‌పాటున బెంగ‌ళూరుకు వెళ్లుంటే సినిమాలోకి వ‌చ్చే అవ‌కాశం చేజారుండేది’ అని గుర్తు చేసుకున్నారు. (పోలీసులకు అక్షయ్‌ ఫిట్‌నెస్‌ ట్రాకర్లు..)

ఆయ‌న సంత‌కం చేసిన‌ తొలి చిత్రం‌ 'దీద‌ర్‌'తో పాటు మిగ‌తా రెండు చిత్రాలైన 'ఖిలాడీ', 'మిస్ట‌ర్ బాండ్' కూడా 1992లోనే విడుద‌ల‌య్యాయి. ఇవి ఆయ‌న‌కు ప్ర‌త్యేక గుర్తింపును తెచ్చిపెట్ట‌డ‌మే కాక వ‌రుస అవ‌కాశాల‌ను అందించాయి. కాగా ప్ర‌స్తుతం ఆయ‌న హిందీలో టాప్ హీరోగా రాణిస్తున్నారు. క‌రోనా నిబంధ‌న‌లు స‌డ‌లించిన త‌ర్వాత బాలీవుడ్‌లో అక్ష‌య్ తొలిసారి కెమెరా ముందుకు వెళ్లారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆయ‌న న‌టిస్తున్న "బెల్ బాట‌మ్" యూకేలో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది. (తిరుగులేదని నిరూపించుకున్న ‘ఖిలాడీ’!)

>
మరిన్ని వార్తలు