సూపర్‌ పోలీస్‌ వస్తున్నాడు

4 Feb, 2021 05:34 IST|Sakshi
కత్రినా కైఫ్, అక్షయ్‌ కుమార్‌

అక్షయ్‌ కుమార్‌ హీరోగా దర్శకుడు రోహిత్‌ శెట్టి తెరకెక్కించిన సూపర్‌ పోలీస్‌ చిత్రం ‘సూర్యవన్షీ’. కత్రినా కైఫ్‌ కథానాయిక. ఈ సినిమాలో రణ్‌వీర్‌ సింగ్, అజయ్‌ దేవగణ్‌ అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం గత ఏడాది మార్చిలో థియేటర్స్‌లోకి రావాల్సింది. కోవిడ్‌ వల్ల వాయిదా పడింది. తాజాగా ఏప్రిల్‌ 2న ‘సూర్యవన్షీ’ని థియేటర్స్‌లోకి తీసుకురావాలనుకుంటున్నారు. కోవిడ్‌ తర్వాత థియేటర్స్‌లో విడుదలవుతున్న పెద్ద హిందీ చిత్రం ఇదే కావడం విశేషం.

మరిన్ని వార్తలు