జవాన్లతో గడిపిన క్షణాలు మరిచిపోలేనంటున్న అక్షయ్‌

17 Jun, 2021 17:39 IST|Sakshi

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అక్షయ్ కుమార్ గురువారం భారత జవాన్లతో గడిపారు. ఈ సందర్భంగా వారితో గడిపిన క్షణాలను ఫోటోలు, వీడియోలను ఆయన సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ఇవి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారి హల్‌చల్‌ చేస్తోంది. దేశాన్ని కాపాడే జవాన్లంటే ఈ ఖిలాడీ హీరోకు ప్రత్యేకమైన అభిమానం అని ఎన్నో సార్లు చెప్పారు. ఇదే విషయాన్ని ఆయన తన చేతల ద్వారా నిరూపించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.

జవాన్లతో ఓ రోజు గడిపిన కేసరి 
అక్షయ్‌ గురువారం నాడు ఉత్తర కాశ్మీర్లోని గురేజ్లో లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్ఓసి) కు కాపలాగా ఉన్న బీఎస్ఎఫ్ జవాన్లను కలిశారు. కార్గో ప్యాంటు, లేత గోధుమరంగు టీ షర్టుతో తాను ఓ జవానులా మారి వారిలో ఒకరిలా కలిసిపోయారు. అక్కడి జవాన్లతో కాసేపు ముచ్చటించారు. అనంతరం అక్కడ సంప్రదాయంగా జరిగే కార్యక్రమాలకు డీజీ బీఎస్ఎఫ్ ఎస్‌హెచ్‌. రాకేశ్ అస్థానాతో కలిసి హాజరయ్యారు. 

అనంతరం అక్షయ్‌ నటించిన గుడ్ న్యూవ్జ్ చిత్రం నుంచి సౌదా ఖారా ఖారా పాటకు కాసేపు స్టెప్పులు వేసి అందరినీ అలరించాడు. ఈ సందర్భంగా మన కేసరి జవాన్లతో గడిపిన కొన్ని ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. వాటికి క్యాప్షన్‌గా.. "ఈ రోజు సరిహద్దులను కాపలాగా ఉన్న ధైర్యవంతులతో ఒక రోజు గడపడం మరచిపోలేను. ఇక్కడకు రావడం నాకు ఎప్పుడూ మాటలతో వర్ణించలేని  అనుభుతిని కలిగిస్తుంది. ఈ రోజు నిజమైన హీరోలను కలవడం నాకేంతో సంతోషంగా ఉందంటూ’  అందులో తెలిపారు. కాగా ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారి దూసుకుపోతోంది. 

  

A post shared by Zoom TV (@zoomtv)

చదవండి: Akshay Kumar: పక్కా ప్లాన్‌.. రూ.1000 కోట్లు టార్గెట్‌!

మరిన్ని వార్తలు