అలాంటి కథలంటే ఇష్టం: సమంత

24 Jul, 2021 00:01 IST|Sakshi
అలీ,సమంత

‘‘నాకు వాస్తవంతో కూడిన జీవిత కథలంటే చాలా ఇష్టం.  అలాంటి స్టోరీతో అలీగారు నిర్మిస్తున్న మొదటి చిత్రం ‘అందరూ బావుండాలి అందులో నేనుండాలి’ హిట్‌ అవ్వాలి’’ అని హీరోయిన్‌ సమంత అన్నారు. అలీ, నరేశ్, పవ్రితా లోకేశ్‌ ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘అందరూ బావుండాలి అందులో నేనుండాలి’.

శ్రీపురం కిరణ్‌ దర్శకత్వంలో అలీ సమర్పణలో మోహన్‌ కొణతాల, బాబా అలీ, శ్రీచరణ్‌ నిర్మించారు. ఎ.ఆర్‌.రెహమాన్‌ శిష్యుడు రాకేశ్‌ పళిదం ఈ సినిమాకు సంగీతదర్శకుడు. ఈ చిత్రంలోని మూడో పాటను సమంత విడుదల చే శారు. అలీ మాట్లాడుతూ – ‘‘నేను అడగ్గానే మా సినిమాలోని మూడో పాటను సమంత రిలీజ్‌ చేయడం హ్యాపీ. ఆమె నటిస్తున్న తాజా చిత్రం ‘శాకుంతలం’ హిట్‌ సాధించాలి’’ అన్నారు.

మరిన్ని వార్తలు