హిందీ బిగ్‌బాస్‌ విన్న‌ర్‌తో అలీ రెజా

11 Nov, 2020 18:02 IST|Sakshi

బిగ్‌బాస్ రియాలిటీ షో ముగిశాక కంటెస్టెంట్లు ఎవ‌రి దారి వాళ్లు చూసుకుంటారు. అప్ప‌టివ‌ర‌కు ఒక‌రిని విడిచి ఒక‌రం ఉండ‌లేమ‌న్నట్లుగా క‌నిపించే వాళ్లు బ‌య‌ట‌కు వ‌చ్చాక మాత్రం ప‌ల‌క‌రింపులు కూడా త‌గ్గించేసేవాళ్లుంటారు. అయితే నాగార్జున మాత్రం కంటెస్టెంట్ల‌ను అంత ఈజీగా మర్చిపోరు. అలాగే నాగ్ కంట్లో ప‌డ‌టమూ అంత సులువేమీ కాదు. గ‌త సీజ‌న్‌లో కండ‌ల వీరుడు అలీ రెజా స్టైల్ న‌చ్చుతుంద‌ని అని నాగార్జున పొగిడేవారు. అయితే ఓసారి వీకెండ్‌లో నాగ్ ధ‌రించిన బ్రాండెడ్ షూ చాలా న‌చ్చింద‌రి, అది త‌న‌కు కావాల‌ని అలీ మ‌న‌సులోని కోరిక‌ను బ‌య‌ట‌పెట్టాడు. అత‌ని కోరిక‌ను త‌ప్ప‌కుండా నెర‌వేరుస్తాన‌న్న నాగ్ ఆ మాట మీద నిల‌బ‌డ్డారు. షో పూర్తైన నెల రోజుల త‌ర్వాత కూడా ఆ విష‌యాన్ని గుర్తుపెట్టుకుని మ‌రీ అలీకి బ్రాండెడ్ షూను నాగ్ గిఫ్ట్‌గా ఇచ్చాడు. (చ‌ద‌వండి: తెలుగు బిగ్‌బాస్‌లో ఆవేశం స్టార్లు ఎవ‌రో తెలుసా?)

అటు అలీ కూడా నాగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న వైల్డ్ డాగ్ సినిమాలో న‌టించే బంప‌రాఫ‌ర్ కొట్టేశాడు. ఈ క్ర‌మంలో నాగ్‌తో క‌లిసి మ‌నాలీలో షూటింగ్ జ‌రుపుకుంటున్న ఫొటోల‌ను కూడా ఆయ‌న అభిమానుల‌తో పంచుకున్నాడు. ఇదిలా వుంటే తాజాగా అలీ షేర్ చేసిన ఫొటో అభిమానుల‌ను ఆశ్చర్యంతో ముంచెత్తుతోంది. అత‌ను హిందీ బిగ్‌బాస్ 13 విన్న‌ర్ సిద్ధార్థ్ శుక్లాతో పాటు షెహ‌నాజ్ గిల్‌ను క‌లిశాడు. మంగ‌ళ‌వారం నాడు చంఢీగఢ్‌ విమానాశ్ర‌య‌మంలో వారిని క‌లుసుకోవ‌డ‌మే కాక ఓ సెల్ఫీ దిగి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. 'తెలుగు బిగ్‌బాస్ హిందీ బిగ్‌బాస్‌ను క‌లిసిన వేళ..' అని ఓ క్యాప్ష‌న్ కూడా పెట్టాడు. 'ముగ్గురు ఫేవ‌రెట్ కంటెస్టెంట్లు ఒకే చోట క‌నిపిస్తే ఆ కిక్కే వేర‌ప్పా' అని ఓ నెటిజ‌న్ సంతోషం వ్య‌క్తం చేయ‌గా 'భ‌లే ఛాన్సు కొట్టేశారు' అంటూ మ‌రికొంద‌రు కామెంట్లు చేస్తున్నారు. కాగా అలీ ఈ మ‌ధ్యే కొత్త యూట్యూబ్ ఛాన‌ల్‌ను కూడా ప్రారంభించాడు. (చ‌ద‌వండి: కాబోయే కోడలికే ఆ డైమండ్‌: శిల్పా శెట్టి)

Yeh dekho kaun mile kal . BB Telugu meets BB Hindi. #SidNaaz

A post shared by Ali Reza (@i.ali.reza) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు