Ali Reza: ఘనంగా అలీ రెజా భార్య సీమంతం ఫంక్షన్‌

8 Oct, 2021 20:04 IST|Sakshi

బుల్లితెర నటుడు అలీ రెజా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బిగ్‌బాస్‌ తెలుగు మూడో సీజన్‌లో పాల్గొన్న అలీ ఫిజికల్‌ టాస్కుల్లో మిగతావారికి గట్టిపోటీనిస్తూ తనేంటో నిరూపించుకున్నాడు. బిగ్‌బాస్‌ ద్వారా వచ్చిన క్రేజ్‌తో ఏకంగా నాగార్జునతో కలిసి 'వైల్డ్‌డాగ్‌' సినిమాలోనూ నటించాడు. కాగా ఈ బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ త్వరలో తండ్రి కాబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అలీ భార్య మసుమ్‌ సీమంతం వేడుక నిర్వహించారు.

ఈ వేడుకకు బుల్లితెర సెలబ్రిటీలు హిమజ, శివజ్యోతి, లాస్య, రవి, శ్రీవాణి తదితరులు హాజరై సందడి చేశారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో అలీ భార్య సీమంతానికి సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. వీటిని చూసిన నెటిజన్లు అలీ దంపతులను క్యూట్‌ కపుల్‌గా అభివర్ణిస్తున్నారు. కాగా సావిత్రి సిరీయల్‌తో బుల్లితెర ఎంట్రీ ఇచ్చిన అలీ ఇటూ నటుడిగా, అటూ మోడల్‌గానూ రాణిస్తున్నాడు. అంతేగాక ‘గాయకుడు’ సినిమాతో హీరోగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన ఇతడు ఇటీవల ‘గుండెల్లో దమ్మున్న దోస్త్‌ ఖాజా భాయ్‌’ అనే మరో సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం విదితమే!

మరిన్ని వార్తలు