‘చెడు అలవాట్లు మానుకోవడం ఒక మంచి అలవాటు’

17 Feb, 2021 10:58 IST|Sakshi

అలియా భట్‌ ఫెవరెట్‌ బుక్‌: ది పవర్‌ ఆఫ్‌ హ్యాబిట్‌

రచన: చార్లెస్‌ డుహెగ్‌ 

‘చదవడానికి టైమ్‌ దొరకడం లేదు’ అని సాకు వెదుక్కోవడం కంటే ‘పుస్తకాలకు టైమ్‌ తప్పకుండా కేటాయించాలి’ అని నిర్ణయం తీసుకుంటే టైమ్‌ చాలా సులభంగా దొరుకుతుంది. బాలీవుడ్‌ అందాలతార ఆలియాభట్‌ వృత్తిరీత్యా బిజీగా ఉన్నప్పటికీ పుస్తకాలు చదవడంలో వెనకబడి పోలేదు. ఆమెకు నచ్చిన పుస్తకాల్లో ఒకటి...‘ది పవర్‌ ఆఫ్‌ హ్యాబిట్‌: వై వుయ్‌ డూ వాట్‌ వుయ్‌ డూ ఇన్‌ లైఫ్‌ అండ్‌ బిజినెస్‌’ న్యూయార్క్‌ టైమ్స్‌ రిపోర్టర్, పులిట్జర్‌ విజేత చార్లెస్‌ డుహెగ్‌ రాసిన ఈ పుస్తకం పరిచయం...

విలియం జేమ్స్‌...19వ శతాబ్దానికి చెందిన ఈ సైకాలజిస్ట్‌ మనుషుల అలవాట్ల గురించి ఒక మంచి మాట చెప్పారు. ‘అనేకానేక అలవాట్ల సమహారమే మన జీవితం’ అలవాటే కదా...అని తేలిగ్గా తీసుకోవద్దు. ఆ అలవాటే జీవితాలను ముంచుతుంది. ఆ అలవాటే చరిత్రహీనులను చేస్తుంది. ఆ అలవాటే జీవితాన్ని వెలిగిస్తుంది. ఆ అలవాటే చరితార్థులను చేస్తుంది. ఏ అలవాటుకు మనం దగ్గర కావాలనేదానిపైనే మన ఉన్నతి ఆధారపడుతుందంటాడు రచయిత.మంచి అలవాట్ల సంగతి అలా వదిలేద్దాం. ఇప్పుడు మన సమస్యంతా చెడు అలవాట్ల గురించే.
చదవండి: ‘బ్రహ్మాస్త్ర’ షూటింగ్‌: అలియా,రణ్‌బిర్‌లతో నాగార్జున
టాలీవుడ్‌కు జాన్వీ కపూర్‌.. డైరెక్టర్‌ ఎవరంటే!

అదొక అలవాటుగా మారిపోయింది.
‘అలవాటు అనేది విధిరాత కాదు. ఈ సత్యం తెలిస్తే వ్యాపారాలే కాదు జీవితాలు కూడా ఊహించనంతగా మారిపోతాయి’ అంటాడు రచయిత. ఒక వ్యాపారం శిఖరస్థాయికి చేరడంలో వినియోగదారుల ‘అలవాటు’  ఎంత కీలకంగా మారుతుందో చెబుతారు రచయిత. కొందరు పెర్‌ఫ్యూమ్‌ నుంచి చెప్పుల వరకు ఒకేరకమైన బ్రాండ్‌ను ఇష్టపడతారు. దీంట్లో నాణ్యత పాత్ర కంటే ‘అలవాటు’ పాత్రే చాలా ఎక్కువగా ఉంటుంది. కొత్తవి ట్రై చేయకపోవడానికి ఇదే కారణం. ఒన్స్‌ అపాన్‌ ఏ టైమ్‌...అమెరికన్స్‌ టూత్‌పేస్ట్‌ వాడే వారు కాదు. పండ్లు వాటికవే శుభ్రమవుతాయని కొందరు వీలైనంత గట్టిగా నమ్మేవారు. అలాంటి పరిస్థితుల్లో  పెప్సిడెంట్‌(1916) టూత్‌పేస్ట్‌ కంపెనీ ఒక అందమైన అమ్మాయితో ‘పెప్సిడెంట్‌ గీవ్స్‌ యూ ఏ బ్యూటీఫుల్‌ స్మైల్‌’ అంటూ యాడ్‌ చేసింది. ఇది సూపర్‌హిట్‌ అయింది. ప్రజలు మెల్లిగా ఈ పేస్ట్‌కు దగ్గరయ్యారు. మొదట ఏ దృష్టితో దగ్గరైనా ఆ తరువాత అదొక అలవాటుగా మారిపోయింది. కంపెనీ ఎక్కడికో వెళ్లిపోయింది! అలవాటు ఏర్పడడంలోనూ ఒక సైన్స్‌ ఉంటుందని, ‘హ్యాబిట్‌ ఫామింగ్‌’లోని ఈ సైన్స్‌ కేవలం వాణిజ్య ఉత్పత్తుల అమ్మకానికే కాదు మన వ్యక్తిత్వ పునర్‌నిర్మాణంలోనూ కీలకం అంటాడు రచయిత. మంచి అలవాట్లు అనేవి మైఖేల్‌ ఫెల్ఫ్, స్టార్‌బక్స్‌ సీయివో హోవార్డ్‌ షోల్చ్, పౌరహక్కుల ఉద్యమకారుడు మార్టిన్‌ లూథర్‌ కింగ్‌...మొదలైన వారి విజయాలలో ఎంతకీలకమయ్యాయో చెబుతారు రచయిత.

హౌ హ్యాబిట్స్‌ వర్క్, హౌ టు క్రియేట్‌ న్యూ హ్యాబిట్స్, ది గోల్డెన్‌ రూల్‌ ఆఫ్‌ హ్యాబిట్‌ చేంజ్, కీ స్టోన్‌ హ్యాబిట్స్, ది పవర్‌ ఆఫ్‌ ఏ క్రైసిస్, హౌ లీడర్స్‌ క్రియేట్‌ హ్యాబిట్స్‌ త్రూ యాక్సిడెంట్‌ అండ్‌ డిజైన్, ఆర్‌ వుయ్‌ రెస్పాన్స్‌బుల్‌ ఫర్‌ అవర్‌ హ్యాబిట్స్‌....ఇలా ఈ చాప్టర్లలో నుంచి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. గాలి పోగేసి రాయడం కాకుండా, సోషల్‌ సైకాలజీ, క్రిమినల్‌ సైకాలజీ, న్యూరోసైన్స్‌కు సంబంధించిన వందలాది సైంటిఫిక్‌ పేపర్స్‌ స్టడీ చేసి, ఎంతోమంది వ్యక్తులను ఇంటర్వ్యూ చేసి ఈ పుస్తకం రాశారు రచయిత. మొదటి చాప్టర్‌లో ఇచ్చిన ది హాబిట్‌ లూప్‌ (రోటిన్, క్యూ, రివార్డ్‌) ఫ్రేమ్‌వర్క్‌లోనే పుస్తకం మొత్తం ఉంటుంది. వ్యక్తులు కావచ్చు, కంపెనీలు కావచ్చు...మారాలని ప్రయత్నిస్తూనే ఉంటారు. కాని చాలా సందర్భాల్లో  అది ప్రయత్నానికి  మాత్రమే పరిమితమవుతుంది. ‘అలా కాదు...ఆ ప్రయత్నం ఫలవంతం కావడం చాలా సులభం’ అనే సత్యాన్ని  తెలుసుకోవడానికి కచ్చితంగా చదవాల్సిన పుస్తకం ఇది.

మరిన్ని వార్తలు