త్రిబుల్‌ ఆర్‌... త్రీ షెడ్యూల్స్‌

10 Dec, 2020 06:13 IST|Sakshi

సోమవారమే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సెట్లో తొలిసారి అడుగుపెట్టారు ఆలియా భట్‌. ఈ షెడ్యూల్‌లో పది రోజులే చిత్రీకరణలో పాల్గొంటారట ఆలియా. రాజమౌళి దర్శకత్వంలో చిన్న ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా తెరకెక్కుతున్న పీరియాడికల్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఇందులో కొమురమ్‌ భీమ్‌గా చిన్న ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్‌ నటిస్తున్నారు. చరణ్‌కు జోడీగా సీత పాత్రలో ఆలియా కనిపిస్తారు. తొలిరోజు షూటింగ్‌లో రామ్‌చరణ్, చిన్న ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో ఆలియా ఓ ఎమోషనల్‌ సన్నివేశంలో పాల్గొన్నారని సమాచారం. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌లో ఆలియా పాత్రకు సంబంధించిన చిత్రీకరణ వారం నుంచి పదిరోజుల వరకూ ఉంటుందని తెలిసింది. మూడు షెడ్యూల్స్‌లో ఆలియా పాత్ర చిత్రీకరణ పూర్తవుతుందట. వచ్చే ఏడాది మిగిలిన రెండు షెడ్యూల్స్‌లో పాల్గొంటారట. మార్చి నెలలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూటింగ్‌ ముగుస్తుందని టాక్‌. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

మరిన్ని వార్తలు