ప్రియుడి బంగ్లాలో అలియా కొత్త ఇల్లు

29 Nov, 2020 18:05 IST|Sakshi

బాలీవుడ్ భామ అలియాభ‌ట్ త‌న ప్రియుడు, న‌టుడు ర‌ణ్‌బీర్ క‌పూర్‌కు మ‌రింత చేరువ కానుంది. పెళ్లి వార్తేమైనా మోసుకొచ్చారేమో? అనుకోకండి. అలాంటిదేమీ లేదు కానీ అలియా త‌న‌ ప్రియుడు నివ‌సిస్తున్న అపార్ట్‌మెంట్‌లోనే ఓ ఫ్లాట్‌ కొనుగోలు చేశార‌ట‌. ముంబైలోని పాలి హిల్‌లో 2460 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణం ఉన్న ఇంటిని త‌న సొంతం చేసుకున్నార‌ని ఆంగ్ల మీడియా క‌థ‌నాలు వెలువ‌రించింది. స‌ద‌రు అపార్ట్‌మెంట్‌లో ర‌ణ్‌బీర్‌ది ఏడో అంత‌స్థు కాగా ఆమెది ఐదో అంత‌స్థు. ఈ ఇంటికి గ‌త‌ నెల‌లోనే పూజ కూడా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి అలియా కుటుంబంతో పాటు ర‌ణ్‌బీర్ ఫ్యామిలీ కూడా హాజ‌రయ్యారు. (చ‌ద‌వండి: వాళ్ల గురించి పట్టించుకున్నారా.. సరేగానీ)

అలియా కొత్తిల్లు ర‌ణ్‌బీర్ ఫ్యామిలీ నివ‌సించే కృష్ణ రాజ్ బంగ్లాకు అత్యంత స‌మీపంలో ఉంది. మొత్తానికి కాబోయే అత్తారింటికి, భ‌ర్త‌కు ద‌గ్గ‌ర‌లోనే ఇల్లు సెట్ చేసుకుంద‌ని బీటౌన్ గుస‌గుస‌లు పెడుతోంది. ఇక‌ అలియా కొత్తింటి కోసం ఏకంగా రూ. 32 కోట్లు ఖ‌ర్చు చేసిన‌ట్లు స‌మాచారం. ఈ ఇంటిని అందంగా తీర్చిదిద్దే బాధ్య‌త‌ను ఆమె గౌరీఖాన్‌కు అప్ప‌గించారు. అప్ప‌టివ‌ర‌కు ఆమె త‌న సోద‌రి షాహీన్ భ‌ట్‌తో క‌లిసి జుహులోనే ఉండ‌నున్నారు. ఇదిలా వుంటే.. ఈ క్రేజ్ ల‌వ్‌బ‌ర్డ్స్ వారు క‌లిసి న‌టించిన బ్ర‌హ్మాస్త్ర చిత్రం విడుద‌ల కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాను కేజో నిర్మిస్తున్నారు. (చ‌ద‌వండి: రణ్‌బీర్‌, అలియా వివాహంపై వివరణ)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా