Alia Bhatt and Ranbir kapoor: ప్రేయసితో రణబీర్‌ బర్త్‌ డే పార్టీ.. ఒక్క రాత్రికి రూ.1.65 లక్షలు

29 Sep, 2021 13:38 IST|Sakshi

బాలీవుడ్‌ ప్రేమ పావురాలు రణ్‌బీర్‌ కపూర్‌, అలియా భట్‌ గత కొన్నేళ్లుగా వారు ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. వారు 2020లో పెళ్లీ చేసుకోబోతున్నట్లు రూమర్స్‌ వచ్చాయి. కానీ కోవిడ్‌ వల్ల ఆగిపోయినట్లు ప్రచారం జరిగింది. 

అయితే మంగళవారం (సెప్టెంబర్‌ 28న) రణ్‌బీర్‌ కపూర్‌ పుట్టిన రోజుగా సెటబ్రేట్‌ చేసుకోడానికి ఈ జంట ఒకరోజు ముందుగానే జోధ్‌పూర్‌లోని సుజన్‌ జవాయి క్యాంప్‌కి చేరుకున్నారు. అక్కడ విలాసవంతంగా గడపడమే కాకుండా స్థానికులతో ఎంజాయ్‌ చేసేలా ఏర్పాట్లు ఉంటాయి. అక్కడ రణ్‌బీర్‌, తన ప్రేయసీతో ఒక రాత్రి పార్టీ చేసుకునేందుకు ఆ రిట్రీట్‌ యాజమాన్యం రూ .75వేల నుంచి రూ.1.65 లక్షల వరకు ఛార్జ్‌ చేస్తుందట. 

కాగా బాయ్‌ఫ్రెండ్‌కి అలియా చెప్పిన విషెస్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ప్రేమ పక్షులు ఇద్దరు కలిసి జోధ్‌పూర్‌లో సూర్యస్తమయాన్ని ఎంజాయ్‌ ఫోటోను బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ‘హ్యపీ బర్త్‌ డే మై లైఫ్‌’ అనే క్యాప్షన్‌ని జోడించింది. దీంతో పోస్ట్‌ చేసిన కొద్ది గంటల్లోనే సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి 2 మిలియన్ల పైగా లైకులని, 17వేలకు పైగా కామెంట్స్‌ని సంపాదించి వైరల్‌గా మారింది.

అయితే ఈ జంట ప్రస్తుతం ‘బ్రహ్మాస్త్ర’ అనే సినిమాలో కలిసి నటిస్తున్నారు. అంతేకాకుండా అలియా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీలో రామ్‌చరణ్‌కి జోడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా త్వరలో వీరి పెళ్లి గురించి అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.

చదవండి: ‘రణ్‌బీర్‌ నా దుస్తులను తన గర్ల్‌ప్రెండ్స్‌కు గిఫ్ట్‌గా ఇచ్చేవాడు’

A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు