మాల్దీవులకు చెక్కేసిన బాలీవుడ్‌ ప్రేమజంటలు

19 Apr, 2021 14:21 IST|Sakshi

సినీతారలకు ఏమాత్రం గ్యాప్‌ దొరికినా ఎంచక్కా ఏదో ఒక దీవిలో వాలిపోతారు. ఇక కరోనా కకావికలం నుంచి తప్పించుకునేందుకు కూడా వారు ఇదే రూట్‌ను ఎంచుకుంటున్నారు. జనసంద్రానికి దూరంగా వ్యక్తిగత జీవితానికి దగ్గరగా ఉండేలా ట్రిప్‌ను ప్లాన్‌ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్‌ ప్రేమజంటలు మరోసారి మాల్దీవులు చెక్కేశాయి.

మహారాష్ట్రలో జనతా కర్ఫ్యూ అమల్లో ఉండటంతో రణ్‌బీర్‌ కపూర్‌- అలియా భట్‌, టైగర్‌ ష్రాఫ్‌- దిశా పటానీలు మాల్దీవులకు వెళ్లారు. యంగ్‌ హీరోలు రణ్‌బీర్‌, టైగర్‌లు తమ నెచ్చెలితో కలిసి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. రణ్‌బీర్‌ జోడి నేడు(సోమవారం) ఉదయం ముంబై ఎయిర్‌పోర్టు నుంచి పయనమైన పలు ఫొటోలు సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఇక వీళ్ల కన్నా ఒక రోజు ముందే మాల్దీవుల్లో వాలిపోయింది టైగర్‌ ష్రాఫ్‌ జోడీ. ఆదివారం నుంచే అక్కడ సేద తీరుతూ ఎంజాయ్‌ చేస్తోంది.

కాగా కరోనా బారిన పడ్డ బాలీవుడ్‌ ప్రేమ జంట రణ్‌బీర్‌ కపూర్‌, అలియా భట్‌ ఇటీవలే దాన్ని జయించారు. వైరస్‌ను ఎదుర్కొన్న తర్వాత వారిద్దరూ కలిసి బయటకు వెళ్లడం ఇదే తొలిసారి. ఇదిలా వుంటే పలువురు తారలు సైతం హాలీడే ట్రిప్‌ ప్లాన్‌ చేసుకునే పనిలో పడగా మరికొంతమంది ఇప్పటికే సిటీని వీడి నచ్చిన ప్రదేశాలకు వెళ్లిపోయారు.

కాగా కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో షూటింగ్‌లు ఆపేయాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో పలు సినిమాలు వాయిదా బాట పడగా పలువురు సెలబ్రిటీలు తిరిగి తమ ఫ్యామిలీకి సమయం కేటాయిస్తున్నారు.

చదవండి: ఏంటి? నాకు రోజుకు రూ.16 కోట్లు వస్తాయా?: హీరో

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు