Alia Bhatt: మహేశ్‌ బాబుకు జోడిగా అలియా?, ఎన్టీఆర్‌ సరసన చర్చలు!

8 Mar, 2022 11:11 IST|Sakshi

టాలీవుడ్‌పై బాలీవుడ్‌ బ్యూటీ ఆలియా భట్‌ స్పెషల్‌ ఫోకస్‌ పెట్టినట్లున్నారు. ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (రౌద్రం..రణం..రుధిరం) చిత్రంలో రామ్‌చరణ్‌ సరసన నటించారు ఆలియా భట్‌ (ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ మరో హీరో). ఈ చిత్రం మార్చి 25న విడుదల కానుంది. అలాగే ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన చిత్రంలో హీరోయిన్‌ పాత్ర కోసం తనను సంప్రదించారని, చర్చలు జరుగుతున్నట్లు ఇటీవల ఓ ఇంటర్య్వూలో స్వయంగా ఆలియానే చెప్పారు.

చదవండి: కండోమ్‌ టెస్టర్‌గా రకుల్‌, ఆమె తల్లిదండ్రులు ఏమన్నారంటే..

తాజాగా మహేశ్‌బాబుకు జోడీగా ఆలియా భట్‌ కనిపించే అవకాశం ఉందనే టాక్‌ బాలీవుడ్‌లో వినిపిస్తోంది. మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌ పాత్ర కోసం చిత్రబృందం పరిశీలిస్తోన్న పేర్లలో ఆలియా భట్‌ పేరు ముందువరుసలో ఉందని టాక్‌. మరి.. వెండితెరపై కొత్త జోడీగా మహేశ్, ఆలియా కనిపిస్తారా? వేచి చూడాల్సిందే.

మరిన్ని వార్తలు