వైరస్‌ వ్యాప్తి నుంచి ఎలా రక్షించుకోవాలి: అలియా

3 Apr, 2021 16:52 IST|Sakshi

బాలీవుడ్‌ బ్యూటీ అలియా భట్‌ కరోనా బారిన పడిని సంగతి తెలిసిందే. ప్రస్తుతం హోంక్వారంటైన్‌లో ఉన్న అలియా త్వరలో మహమ్మారి నుంచి బయటపడాలని కోరుకుంటూ పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు, నటీనటులు సోషల్‌ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో అలియా భట్‌ తల్లి సోని రజ్ధాన్‌ కూతురి ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శనివారం ఆమె ట్వీట్‌ చేస్తూ ఈ వైరస్‌ వ్యాప్తి నుంచి ఎలా రక్షించుకోవాలో అర్థం కావడం లేదంటూ ట్విటర్‌లో ఇలా రాసుకొచ్చారు.

‘ఇది సాధారణ తరంగం కాదు… ఈ వైరస్‌ ప్రతిచోటా ఉంది. ప్రతి ఇళ్లలో ఉంది, మన జుట్టులో ఉంది. ఇది తలచుకుంటుంటే చాలా భయంగా ఉంది. ఇది సాధారణ తరంగం కాదు.. ఈ మహమ్మరి ప్రతిచోటా ఉంది. ఇక మనం ఎలా ముందుకు సాగాలి. దీని నుంచి ఎలా బయటపడాలి. అసలు ఇది రాకుండ ఉండేందుకు ఎలా జాగ్రత్త పడాలి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న మహమ్మారి వ్యాప్తి మాత్రం ఆగడం లేదు. ప్రతి ఇల్లు, ప్రతి కార్యాలయం, ప్రతి వీధి, ప్రతి జిల్లా, ప్రతి రాష్ట్రం, ప్రతి దేశం.. ఎక్కడ లేదని చెబుతాం. ప్రతి చోటా ఉంది’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

కాగా అలియా తనకు కరోనా పాజిటివ్‌గా తెలినట్లు స్వయంగా ప్రకటించారు. డబుల్‌ హోమ్‌ క్వారంటైన్‌ను ఎక్స్‌పీరియన్స్‌ చేస్తున్నారు హీరోయిన్‌ ఆలియా భట్‌. సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో ఆలియా భట్‌ టైటిల్‌ రోల్‌ చేస్తున్న సినిమా ‘గంగూబాయి కతియావాడి’. ఈ సినిమా షూటింగ్‌లో దర్శకుడు సంజయ్‌కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో ఆలియా కూడా క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఇలా హోమ్‌ క్వారంటైన్‌ను పూర్తి చేశారో లేదో అలా మరోసారి క్వారంటైన్‌కి వెళ్లారు ఆలియా. ఈసారి ఆలియాకు కరోనా సోకింది. 

చదవండి: 
రెండుసార్లు క్వారంటైన్‌కు వెళ్లిన స్టార్‌ హీరోయిన్‌ 
అలియా భట్‌కి షాకిచ్చిన ముంబై కోర్టు

మరిన్ని వార్తలు