దీపికా, ప్రియాంక చోప్రా బాటలో అలియా భట్‌

9 Jul, 2021 15:15 IST|Sakshi

బాలీవుడ్ స్టార్‌ హీరోయిన్స్‌ వరుసగా హాలీవుడ్‌పై కన్నేస్తున్నారు. ఇప్పటికే హీరోయిన్‌ ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనెలు హాలీవుడ్‌లో తమ సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఏకంగా ప్రియాంక వరుసగా హాలీవుడ్‌ ఆఫర్లను అందుకుంటూ గ్లోబల్‌ స్టార్‌గా ఎదిగింది. తాజాగా వారి బాటలో అలియా భట్‌ కూడా నడుస్తోంది. బాలీవుడ్‌లో వరుస హిట్స్‌తో స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న అలియా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇప్పుడు ఆమె హాలీవుడ్‌ ఎంట్రీ కూడా ఖరారు అయినట్లు తెలుస్తోంది.

డబ్ల్యూఎమ్‌ అనే హాలీవుడ్‌ టాలెంటెడ్‌ ఎజెన్సీతో ఆమె ఓ కంట్రాక్ట్‌ కుదుర్చుకుందటని, ఈ సంస్థతో ఓ మూవీకి సంతకం కూడా చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడనున్నట్లు సమాచారం. కాగా ప్రస్తుతం అలియా సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 2గంగూబాయ్‌ కతియావాడి’ మూవీ షూటింగ్‌తో బిజీగా ఉంది. దీనితో పాటు ‘రాఖీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్‌ కహాని’  చిత్రంతో కూడా నటిస్తుంది. మరోపక్క డ్రీమ్స్‌ అనే మూవీలో నటిస్తునే ఈ మూవీకి ఆమె నిర్మాతగా కూడా వ్యవహరిస్తుంది. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు