ఆ రాత్రి అంతా ఆలోచిస్తూనే ఉన్నా!

4 Jul, 2021 00:31 IST|Sakshi

‘‘నిర్మాతగా మారినప్పటికీ నేనొక నటినని ఎప్పటికీ మర్చిపోను’’ అంటున్నారు బాలీవుడ్‌ బ్యూటీ ఆలియా భట్‌. తన నిర్మాణసంస్థ ఎటర్‌నల్‌ సన్‌షైన్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ‘డార్లింగ్స్‌’ అనే చిత్రాన్ని నిర్మిస్తూ, ఓ లీడ్‌ క్యారెక్టర్‌ చేస్తున్నారు ఆలియా. షెఫాలీ షా, రోషన్‌ మ్యాథ్యూ, విజయ్‌ వర్మ ఈ చిత్రంలోని ఇతర ముఖ్య తారాగణం. ఈ సినిమా షూటింగ్‌ శనివారం ప్రారంభమైంది. ‘‘నిర్మాతగా నా తొలి చిత్రం ‘డార్లింగ్స్‌’ చిత్రీకరణ మొదలైంది. కానీ నా మొదటి ప్రాధాన్యం ఎప్పుడూ యాక్టింగ్‌కే. నిర్మాతగా నా తొలి సినిమా  మొదలుపెట్టనున్నాననే ఆందోళన, భయంతో ముందు రోజు రాత్రంతా ఆలోచిస్తూనే ఉన్నాను.

డైలాగ్స్‌ ఎలా చెబుతానో అని టెన్షన్‌ కూడా పడ్డాను. ఒకవేళ సెట్‌కు ఆలస్యంగా వెళతానేమోననే భయంతో 15 నిమిషాలు ముందుగానే షూటింగ్‌ లొకేషన్‌కు చేరుకున్నాను. ఇలా టెన్షన్, భయం ఉన్నాయంటే చాలా చాలా జాగ్రత్తగా ఉంటున్నానని అర్థం’’ అన్నారు ఆలియా. ‘డార్లింగ్స్‌’ సినిమాకు షారుక్‌ ఖాన్‌ కూడా ఓ నిర్మాత కావడం విశేషం. ఇదిలా ఉంటే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో రామ్‌చరణ్‌ సరసన ఆలియా కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 10న ఆరంభం కానున్న ఈ సినిమా చిత్రీకరణలో ఆలియా పాల్గొంటారని సమాచారం.

మరిన్ని వార్తలు