Alia Bhatt: ఆలియా వేసుకున్న పల్చని డ్రెస్‌ అన్ని లక్షలా?

27 Aug, 2022 21:21 IST|Sakshi

బాలీవుడ్‌ బ్యూటీ ఆలియా భట్‌ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీబిజీగా ఉంది. ఇటీవల విడుదలైన గంగూబాయి కతియావాడి, డార్లింగ్స్‌ సినిమాల విజయంతో హుషారు మీద ఉన్న ఈ భామ ప్రస్తుతం బ్రహ్మాస్త్ర సినిమా చేస్తోంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌, అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున ముఖ్య పాత్రలో నటించారు. పాన్‌ ఇండియాగా తెరకెక్కిన బ్రహ్మాస్త్ర సెప్టెంబర్‌ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

మూవీ రిలీజ్‌కు దగ్గర పడుతున్నవేళ ఆలియా తన భర్తతో కలిసి ప్రమోషన్‌లో పాల్గొంది. ఇప్పుడు ఆలియా ప్రెగ్నెంట్‌ అ‍న్న విషయం తెలిసిందే. అయినా ఇంట్లో విశ్రాంతి తీసుకోకుండా సినిమా ప్రమోషన్‌లో పాల్గొంటుంది. తాజాగా.. ఈ నటి  బ్రహ్మస్త్ర సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తన బేబీ బంప్‌తో దర్శనమిచ్చింది. గూచీ బ్రాండ్‌కు చెందిన పింక్‌ కలర్‌ డ్రెస్‌, మ్యాచింగ్‌ బ్లాక్‌ ప్యాంట్‌ కోట్‌తో స్టైలిష్‌గా కనిపించారు.  ప్రస్తుతం ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.
చదవండి: Samantha: సమంత ఎక్కడ? ఎందుకు సైలెంట్‌గా ఉంది? కారణం ఇదేనా!

అయితే ఆలియా ధరించిన ఈ డ్రెస్‌ ధర ఎంతో తెలుసా? దీని  గురించి ఏకంగా నెట్టింట్లో చర్చే జరుగుతోంది. పింక్‌ కలర్‌ చిఫాన్‌ రఫుల్‌ టాప్‌ ధర గూచీ అధికారిక  వెబ్‌సైట్‌లో 4,100 డాలర్లుగా ఉంది. అంటే ఇండియన్‌ కరెన్సీ ప్రకారం దాదాపు 3,27,883 రూపాయలన్న మాట. ఒక్క డ్రెస్‌కు ఆలియా అంత ఖర్చు పెట్టడంతో నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. 


 

మరిన్ని వార్తలు