'నా జీవితం మారిపోయింది.. మీలాంటి వ్యక్తి మరొకరు లేరు'

27 Jun, 2021 18:19 IST|Sakshi

 ‘గంగూబాయ్ కతియావాడి’ షూటింగ్‌ పూర్తి.. ఆలియా ఎమోషనల్‌

సంజయ్‌ లీలా భన్సాలీ దరకత్వంలో ఆలియా భట్‌ నటించిన చిత్రం ‘గంగూబాయ్ కతియావాడి’.ముంబైలోని కామాటిపురకు మకుటం లేని మహారాణిగా పేరొందిన గంగూబాయి పాత్రను అలియా పోషించింది. తాజాగా ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయ్యింది. 2019లో మొదలైన గంగూబాయ్ షూటింగ్‌ నేడు ముగిసింది. ఈ సందర్భంగా రెండేళ్ల ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ ఆలియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టును షేర్‌ చేసింది. '2019, డిసెంబర్‌8న గంగూబాయ్ షూటింగ్‌ను ప్రారంభించాము. రెండేళ్లకు ఈ సినిమా పూర్తయ్యింది. ఈ మధ్యలో రెండుసార్లు లాక్‌డౌన్‌, రెండు తుఫానులు కూడా వచ్చి వెళ్లాయి. షూటింగ్‌ టైంలో డైరెక్టర్‌తో సహా కొందరు కరోనా బారిన పడ్డారు. దాంతో పాటు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాం. కానీ వాటన్నింటిలోనూ సంతోషకరమైన విషయం ఏంటంటే..మీతో కలిసి పని చేయడం.


భన్సాలీ సర్‌ దర్శకత్వలో పనిచేయడం అన్నది నా కల. అది ఇంత త్వరగా నెరవేరుతుందనుకోలేదు. మీతో పనిచేయడం నా జీవితాన్ని మార్చేసింది. మీలాంటి వ్యక్తి మరొకరు లేరు. ఐ లవ్‌ యూ సర్‌. ఇక  సెట్‌కు ఇక గుడ్‌బై చెప్పాల్సిన టైం వచ్చేసింది. అయితే  ఈ రెండేళ్ల ప్రయాణంలో నటిగా చాలా విషయాలు నేర్చుకున్నా. షూటింగ్‌ అయిపోయిందంటే బాధగా కూడా ఉంది. నాలో కొంత భాగాన్ని కోల్పోయినట్లు అనిపిస్తుంది. ఫైనల్‌గా గంగూ ఐ లవ్‌ యూ. నిన్ను మిస్సవుతున్నాం.


ముఖ్యంగా రెండేళ్ల ఈ ప్రయాణంలో నాకు తోడుగా నిలిచిన నా కుటుంబం, సన్నిహితులు, క్ర్యూ, సిబ్బంది అందరికి ధన్యవాదాలు..మీరు లేకపోతే ఇది అంత సులువుగా అయ్యేది కాదు' అంటూ ఆలియా చాలా ఎమోషనల్‌ అయ్యారు. ఇక ఈ సినిమాలో అజయ్‌ దేవగన్‌ కీలక పాత్రలో నటించారు. జయంతి లాల్ గ‌డా నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌, టీజర్‌ ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. ఈ సినిమాను ఈ ఏడాది జూలై 30న రిలీజ్‌ చేయాలనుకుంటుంది చిత్ర బృందం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt)

చదవండి : గంగుబాయి.. నేటికి ఆమె ఫోటో వేశ్యాగృహాల్లో..
ఆల్రెడీ పెళ్లైన దర్శకుడిని ప్రేమించిన హీరోయిన్‌!

మరిన్ని వార్తలు