సంక్రాంతికి అయలాన్

25 Sep, 2023 00:40 IST|Sakshi
శివ కార్తికేయన్‌

శివ కార్తికేయన్, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ జంటగా ఆర్‌.రవికుమార్‌ దర్శకత్వంలో రూపొందిన సైన్స్ ఫిక్షన్  ఫిల్మ్‌ ‘అయలాన్ ’. కోటపాడి జె.రాజేష్, ఆర్‌డీ రాజా నిర్మించిన ఈ సినిమాను సంక్రాతికి విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. ‘‘అయలాన్  అంటే ఏలియన్  అని అర్థం.

ఈ ప్రయాణంలో మాకు కొన్ని కష్టాలు ఎదురైనప్పటికీ ధైర్యం కోల్పోకుండా, పట్టుదలతో ఈ సినిమా చేశాం. నాణ్యతా ప్రమాణాల్లో రాజీ పడాలనుకోవడం లేదు. అందుకే సినిమా విడుదల కొంత ఆలస్యం అవుతోంది. మా మూవీలో 4500 సీజీ షాట్స్‌ ఉన్నాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో మా మూవీ రిలీజ్‌ కానుంది’’ అని యూనిట్‌ పేర్కొంది. ఈ సినిమాకు ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించారు.

మరిన్ని వార్తలు