ఆ డబ్బంతా ఏమైంది?.. ఆసక్తికరంగా ‘అలిపిరికి అల్లంత దూరంలో’ టీజర్‌

8 Sep, 2022 16:57 IST|Sakshi

నూతన నటుడు రావణ్ నిట్టూరు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘అలిపిరికి అల్లంత దూరంలో’. కాస్కేడ్ పిక్చర్స్ పతాకంపై  రమేష్ డబ్బుగొట్టు, రెడ్డి రాజేంద్ర పి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్‌ నందిని రెడ్డి దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసిన ఆనంద్‌ జె దర్శకత్వం వహిస్తున్నాడు. రాబరీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ టీజర్‌ తాజాగా విడుదలైంది. నిమిషం 30 సెకన్లు నిడివి గల టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది.

తిరుపతిలో ఫోటో షాపు పెట్టుకోవాలని తపించే హీరో.. అతనికి ఒక అందమైన ప్రేమ కథ, సరదగా సాగిపోతున్న అతని జీవితాన్ని ఒక మనీ బ్యాగ్ ఊహించని మలుపు తిప్పుతుంది. ఈ క్రమంలో వచ్చిన సంఘటనలు కథపై ఆసక్తిని పెంచాయి. ఫణి కళ్యాణ్ అందించిన నేపధ్య సంగీతం బాగుంది. తిరుపతి నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ‘తిరుపతి’పాటకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఈ చిత్రంలో శ్రీ నికిత, అలంకృత షా, బొమ్మకంటి రవీందర్, అమృత వర్షిణి సోమిశెట్టి లహరి గుడివాడ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మరిన్ని వార్తలు