నమ్మకం రెండింతలయింది

18 Nov, 2022 05:50 IST|Sakshi

– రావణ్‌

రావణ్‌ నిట్టూరు, శ్రీ నిఖిత జంటగా ఆనంద్‌. జె దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అలిపిరికి అల్లంత దూరంలో..’. రమేష్‌ డబ్బుగొట్టు, రెడ్డి రాజేంద్ర.పి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా రావణ్‌ మాట్లాడుతూ– ‘‘ఈ కథ విన్నప్పుడు ఈ సినిమాపై కలిగిన నమ్మకం అవుట్‌పుట్‌ చూసిన తర్వాత రెండింతలయింది. కొత్తవాళ్లతో కూడా మంచి సినిమా తీయవచ్చని మా సినిమా చూసిన తర్వాత మరోసారి నిరూపితమవుతుంది.

ఇంతమంచి స్క్రిప్ట్‌లో నన్ను భాగం చేసిన దర్శకుడు ఆనంద్‌కు ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘ఇందులో పూర్తిగా తిరుపతి నేటివిటీని చూస్తారు. నటీనటులు కొత్తవారైనా అంకితభావంతో పని చేశారు’’ అన్నారు ఆనంద్‌. ‘‘థ్రిల్లర్‌తో పాటు ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో డివైన్‌ టచ్‌ ఉన్న సినిమా ఇది. తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు, ఓవర్సీస్‌లో కూడా రిలీజ్‌ చేస్తున్నాం’’ అన్నారు నిర్మాతలు రమేష్, రాజేంద్ర. హీరోయిన్‌ శ్రీ నిఖితతో పాటు చిత్ర యూనిట్‌ పాల్గొన్నారు.  
 

మరిన్ని వార్తలు