హీరోగా ఎంట్రీ.. సోహైల్‌ కొత్త సినిమా ఫిక్స్‌!

24 Dec, 2020 11:11 IST|Sakshi

బిగ్‌బాస్‌ సీజన్‌ 4 సీజన్‌లో మూడో ప్లేస్‌లో నిలిచిన సోహైల్‌ ప్రజల్లో విన్నర్‌ కంటే ఎక్కువ క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు. సెకండ్‌ రన్నరఫ్‌గా నిలిచినా.. విన్నర్‌ సాధించినంత ఫ్రైజ్‌ మనీని సొంతం చేసుకుకున్నాడు. రూ.25లక్షలు తీసుకోవడానికి ముందుకు వచ్చిన సోహైల్‌ నిర్ణయం అందరిని ఆకట్టుకుంది. బిగ్‌బాస్‌ నుంచి వచ్చిన తర్వాత సినిమాల్లో నటించాలని ఉన్నట్లు తన మనసులోని మాటను సోహైల్‌ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఒకటి రెండు సినిమాల్లో నటించిప్పటికీ సోహైల్‌కు పెద్దగా పేరును తెచ్చిపెట్టలేదు. అయితే బిగ్‌బాస్‌కు వెళ్లిన తర్వాత సోహైల్‌ లైఫ్‌ టర్న్‌ అయ్యిందని చెప్పవచ్చు. అయితే ఇలా తన ఉద్ధేశ్యం బయటకు చెప్పాడో లేదో అలా సోహైల్‌కు సినిమాల నుంచి అవకాశాల వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే మెగాస్టార్‌ చిరంజీవి, కమెడీయన్‌ బ్రహ్మనందం వంటి స్టార్‌ సెలబ్రిటీలు సోహైల్‌ చిత్రంలో నటిస్తామని మాటివ్వగా.. హౌజ్‌‌ నుంచి బయటకు వచ్చిన రోజే ఓ సినిమా స్టోరీ కూడా విన్నట్లు సోహైల్‌ చెప్పాడు. చదవడి: మెహబూబ్‌ సైగలపై సోహైల్‌ రియాక్షన్

ఈ క్రమంలో తాజాగా సోహైల్‌ హీరోగా తన మొదటి సినిమాకు ఓకే చెప్పాడు. జార్జిరెడ్డి, ప్రెషర్‌ కుక్కర్‌ సినిమాలను నిర్మించిన అప్పిరెడ్డి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఎమోషనల్‌ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాను కొత్త దర్శకుడు శ్రీనివాస్‌ డైరెక్ట్‌ చేయనున్నారు. దర్శకుడు మంచి స్క్రిప్ట్ రెడీ చేసి సోహైల్‌ దగ్గరకు తీసుకెళ్లగా కథ విన్న అతడు ఓకే కూడా చెప్పాడు. దీంతో ఈ చిత్రం ప్రీ పప్రొడక్షన్‌ పనులు 2021 న్యూయర్‌ తర్వాత ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరిలో సెట్స్‌ మీదకు వెళ్లనుంది. సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. దీన్ని పక్కన పెడితే హీరో కావాలన్న సోహైల్‌ ఆశ తొందరలోనే నెరవేరనుంది. ఇప్పటికే బిగ్‌బాస్‌ విన్నర్‌ ప్రకటించేందుకు వచ్చిన చీఫ్‌ గెస్ట్‌గా వచ్చిన మెగాస్టార్‌ చిరంజీవి సోహైల్‌ మేనరిజం.. ‘కథ వేరే ఉంటది’ తన సినిమాల్లో వాడుకుంటానని చిరు చెప్పడమే కాకుండా ఎప్పటికైనా సోహైల్‌తో తనొక మంచి సినిమా చేస్తానని మాటిచ్చాడు. అదే విధంగా టాలీవుడ్ కమెడీయన్ బ్రహ్మానందం కూడా సోహెల్ చేసే సినిమాలో రూపాయి తీసుకోకుండా నటిస్తానని తెలిపినట్లు సోహైల్‌ స్వయంగా వెల్లడించారు. చదవండి: సోహైల్‌కు బ్రహ్మానందం బంపర్‌ ఆఫర్‌

ఇక  బిగ్‌బాస్‌ గ్రాండ్‌ ఫినాలేలో టాప్ 3లో ముగ్గురు అబ్బాయిలు మిగల‌గా.. బిగ్‌బాస్‌ నుంచి సోహైల్‌ స్వచ్ఛందంగా ఎలిమినేట్‌ అయిన విషయం తెలిసిందే. నాగార్జున ఇచ్చిన రూ.25లక్షల ఆఫర్‌ను సోహైల్‌ అంగీకరించి.. ఇంటి నుంచి బయటకు వచ్చాడు. సోహైల్‌ నిర్ణయాన్ని అతని కుటుంబ సభ్యులు కూడా స్వాగతించారు. వచ్చిన ఆ 25 లక్షల రూపాయాల్లో అయిదు ల‌క్ష‌లు అనాథశ్ర‌మానికి, మ‌రో ఐదు మెహ‌బూబ్ ఇల్లు క‌ట్టుకునేందుకు ఇస్తాన‌ని చెప్పాడు. కానీ మెహ‌బూబ్ అత‌డి ఆఫ‌ర్‌ను తిర‌స్క‌రిస్తూ ఆ ఐదు ల‌క్ష‌లు కూడా అనాథ‌శ్ర‌మానికే ఇచ్చేయ‌మ‌న్నాడు. వీరి ఆలోచ‌న మెచ్చిన నాగ్ ఆ ప‌ది ల‌క్ష‌లు అనాథ‌శ్ర‌మానికి తాను ఇస్తాన‌ని, సోహైల్‌ను 25 ల‌క్ష‌లు ఇంటికే తీసుకెళ్ల‌మ‌ని చెప్పారు. చదవండి: సోహైల్‌, దివికి చిరు బంపర్‌ ఆఫర్‌!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు