హీరోయిన్‌గా ఆమని మేనకోడలు..మోషన్‌ పోస్టర్‌ రిలీజ్‌

30 Aug, 2021 11:49 IST|Sakshi

విశ్వకార్తికేయ, హ్రితిక శ్రీనివాసన్‌ (నటి ఆమని మేనకోడలు) జంటగా చలపతి పువ్వుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అల్లంత దూరాన’. కోమలి సమర్పణలో ఎన్‌. చంద్రమోహనరెడ్డి తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ఈ చిత్రం మోషన్‌ పోస్టర్‌ను దర్శకుడు బాబీ విడుదల చేసి, చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

‘‘ఇది మంచి ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీ’’అన్నారు చలపతి. ‘‘షూటింగ్‌ పూర్తయింది. తిరుపతి, కేరళ, చెన్నై, పాండిచ్చేరిలోని అందమైన లొకేషన్స్‌లో షూటింగ్‌ చేశాం. ఇందులో తెలుగువారితో పాటు, తమిళ నటీనటులు కూడా నటించారు. మా సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది’’ అన్నారు ఎన్‌.చంద్రమోహన్‌రెడ్డి. 

మరిన్ని వార్తలు