మాటల మాంత్రికుడు, అల్లు అరవింద్‌కు కరోనా!‌

3 Apr, 2021 20:25 IST|Sakshi

దేశంలో మరోసారి మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే పలువురు బాలీవుడ్‌ సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మహమ్మారి టాలీవుడ్‌కు సైతం వ్యాపించింది. ప్రముఖ‌ నిర్మాత అల్లు అరవింద్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌లు కరోనా పాజటివ్‌గా పరీక్షించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరు హోం క్వారంటైన్‌లో ఉన్నారని వినికిడి. అయితే దీనిపై ఇప్పటికి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే అల్లు అరవింద్‌, త్రివిక్రమ్‌లు డాక్టర్ల సలహా మేరకు సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉన్నారని, కరోనా నివారణకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా హీరోయిన్‌ నివేదా థామస్‌ సైతం తాజాగా కరోనా బారిన పడ్డారు.ఈ విషయాన్ని స్వయంగా ఆమె సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. ఆమె ట్వీట్‌ చేస్తూ.. ‘అందరికి నమస్తే.. నేను కరోనా పాజిటివ్‌గా పరీక్షించాను. డాక్టర్‌ సలహాతో అన్ని విధాల మెడికల్‌ ప్రోటోకాల్‌ పాటిస్తూ ఐసోలేషన్‌కు వెళ్లాను. ఇటీవల నన్ను కలిసి వారంత దయచేసి హోం క్వారంటైన్‌కు వెళ్లండి. ఈ కష్టకాలంలో నాకు సపోర్టుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ముఖ్యంగా నా మెడికల్‌ టీంకు. నాపై ప్రత్యేక శ్రద్ధా చూపిస్తున్నా వారికి నిజంగా రుణపడి ఉంటాను’ అంటూ ఆమె ట్వీట్‌ చేశారు. 

చదవండి: 
అయాన్‌ బర్త్‌డే: అల్లు అర్జున్‌ స్పెషల్‌ విషెస్‌‌‌ 
ఖమ్మంలో ‘బేబమ్మ’ సందడి.. ‘ఉప్పెన’లా ఎగసిపడ్డ జనం
త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో ఎన్టీఆర్; మొత్తం 60 ఎపిసోడ్‌లు!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు